ETV Bharat / state

Kitex Telangana: రాష్ట్రంతో కైటెక్స్‌ గ్రూప్‌ ఎంఓయూ.. రూ.2400 కోట్లతో వస్త్ర పరిశ్రమ

author img

By

Published : Sep 18, 2021, 3:11 PM IST

Updated : Sep 19, 2021, 5:03 AM IST

కేరళకు చెందిన ప్రముఖ దుస్తుల తయారీ కంపెనీ కైటెక్స్... రాష్ట్రంలో 2,400 కోట్ల రూపాయల భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో రెండు చోట్ల నెలకొల్పనున్న నూతన ప్లాంట్ల ద్వారా ప్రత్యక్షంగా 22 వేల మందికి, పరోక్షంగా 18 వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్టు కైటెక్స్ తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్​లోని ఓ ప్రైవేటు హోటల్​లో పరిశ్రమల మంత్రి కేటీఆర్ సమక్షంలో కైటెక్స్ గ్రూపు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

Kitex Telangana: రాష్ట్రంతో కైటెక్స్‌ గ్రూప్‌ ఎంఓయూ.. రూ.2400 కోట్లతో వస్త్ర పరిశ్రమ
Kitex Telangana: రాష్ట్రంతో కైటెక్స్‌ గ్రూప్‌ ఎంఓయూ.. రూ.2400 కోట్లతో వస్త్ర పరిశ్రమ
రాష్ట్రంతో కైటెక్స్‌ గ్రూప్‌ ఎంఓయూ.. 22 వేల మందికి ఉపాధి అవకాశం
.

కేరళకు చెందిన దుస్తుల తయారీ సంస్థ కైటెక్స్‌ గ్రూపు తెలంగాణలో రూ.2,400 కోట్ల పెట్టుబడులతో రెండు భారీ దుస్తుల తయారీ పారిశ్రామిక సమూహాలను ఏర్పాటు చేయనుంది. రంగారెడ్డి జిల్లా చందన్‌వెల్లి పారిశ్రామిక పార్కు పరిధి సీతారాంపురంలోని 150 ఎకరాల్లో, వరంగల్‌ జిల్లాలోని కాకతీయ మెగాజౌళి పార్కులోని 150 ఎకరాల్లో వీటిని నెలకొల్పుతుంది.

ఈ పరిశ్రమల ద్వారా ప్రత్యక్షంగా 22 వేల మందికి, పరోక్షంగా 18 వేల మందికి ఉపాధి లభించనుంది. వచ్చే ఏడాది నవంబరు నాటికి ఉత్పత్తి ప్రారంభమవుతుంది. తమ పరిశ్రమల కోసం తెలంగాణలో ఏటా మూడు లక్షల ఎకరాల్లో పండిన పత్తిని కొనుగోలు చేస్తామని సంస్థ పేర్కొంది. ఇక్కడ యేటా 30 లక్షల దుస్తులు తయారు చేసి ఇతర రాష్ట్రాలు, ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామని, భవిష్యత్తులో తెలంగాణ దుస్తులు ధరించని అమెరికా పిల్లలు ఉండబోరని సంస్థ ఎండీ జాకబ్‌ చెప్పారు. పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌, వరంగల్‌, రంగారెడ్డి జిల్లాల మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితారెడ్డి సమక్షంలో శనివారం హైదరాబాద్‌లో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒప్పందంపై కైటెక్స్‌ ఎండీ జాకబ్‌, తెలంగాణ పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్‌ సంతకాలు చేశారు.

ఒక చిన్న వార్తతో పెద్ద ప్రాజెక్టు: కేటీఆర్‌

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ ‘కైటెక్స్‌ కేరళలో ప్రైవేట్‌ రంగంలో అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తున్న గ్రూపు. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద పిల్లల దుస్తుల తయారీ సంస్థ. ఆ రాష్ట్రంలో సంస్థ పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి నాలుగు నెలల క్రితం ఒక పత్రికలో వచ్చిన చిన్నవార్త చూసి సంస్థ ఎండీ జాకబ్‌తో మాట్లాడా. ఆయనకు నమ్మకం కలిగించేందుకు జయేశ్‌రంజన్‌తో కలిసి రాష్ట్రంలోని పరిస్థితులు, వ్యాపార సానుకూలతలను వివరించా. ఇక్కడికి వచ్చి స్వయంగా అధ్యయనం చేయాలని కోరా. కరోనా సమయం కావడం వల్ల రావడానికి ఇబ్బంది అని ఆయన చెబితే ప్రత్యేక విమానం సమకూర్చాం.తన బృందంతో జాకబ్‌ ఇక్కడికి వచ్చి మాతో భేటీ అయ్యారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అనంతరం మొదట రూ.వేయి కోట్ల పెట్టుబడికి అంగీకరించారు. సంప్రదింపుల అనంతరం రెండుచోట్ల రూ.2,400 కోట్ల పెట్టుబడుల నిర్ణయాన్ని ప్రకటించారు. ప్రాజెక్టుల్లో 85 శాతం ఉద్యోగాలను మహిళలకిస్తారు. దీనిపై రెండు చోట్లా స్థానిక మహిళాసంఘాలతో సమావేశాలు పెట్టి.. ఇప్పటి నుంచే శిక్షణ ఇవ్వాలని మంత్రులు ఎర్రబెల్లి, సబిత, ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, యాదయ్యలను కోరుతున్నా. వరంగల్‌, రంగారెడ్డిలలో కంపెనీల ఏర్పాటుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను.. తమ ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వం తరఫున అందిస్తాం’’ అని తెలిపారు.

ఆజంజాహి లోటు తీరుతుంది: ఎర్రబెల్లి

‘వరంగల్‌కు ఖ్యాతి తెచ్చిన ఆజంజాహి మిల్లును ఉమ్మడి రాష్ట్రంలో అమ్మేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల వల్ల కైటెక్స్‌ పరిశ్రమ జిల్లాకు వస్తోంది. దీని ద్వారా ఆ లోటు తీరుతుంది. మా జిల్లా ప్రజలు కేటీఆర్‌కు రుణపడి ఉంటారు’’ అని ఎర్రబెల్లి తెలిపారు. రంగారెడ్డి జిల్లాకు అదిపెద్ద దుస్తుల పరిశ్రమను అందిస్తున్నారని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌లకు సబితారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పరిశ్రమను సద్వినియోగం చేసుకుంటామన్నారు.

కేటీఆర్‌ చొరవ వల్లే భారీ పెట్టుబడులు: కైటెక్స్‌ ఎండీ జాకబ్‌

‘మంత్రి కేటీఆర్‌ చొరవ వల్లే మేం ఇక్కడ భారీ పెట్టుబడి పెడుతున్నాం. కేరళ నుంచి వచ్చి ఆయనను కలిసినప్పుడు తనకు పెట్టుబడి కన్నా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కావాలని అడగడం, ఎంవోయూ కంటే నిర్మాణ గడువే ముఖ్యమనడం, రాష్ట్రం పట్ల నిబద్ధత.. నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. సంస్థ పెట్టుబడిని రూ.వెయ్యి కోట్ల నుంచి రూ.2,400 కోట్లకు పెంచాం’’ అని ఆయన తెలిపారు. తెలంగాణలో తమ సంస్థ అడుగుపెట్టిన సందర్భంగా రూ. 6.5 కోట్ల విలువైన లక్షన్నర పీపీఈ కిట్లను విరాళంగా అందిస్తున్నామని జాకబ్‌ చెప్పారు. సమావేశంలో పరిశ్రమల సంచాలకుడు కృష్ణభాస్కర్‌, టీఎస్‌ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, వరంగల్‌ మేయరు గుండు సుధారాణి పాల్గొన్నారు.

ఇదీ చూడండి: పోడుభూముల సమస్యలపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం సమావేశం

Last Updated : Sep 19, 2021, 5:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.