ETV Bharat / state

ఓఆర్​ఆర్​ మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త

ktr mlc
ktr mlc
author img

By

Published : Oct 1, 2021, 11:58 AM IST

10:53 October 01

ఓఆర్​ఆర్​ మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త

ఓఆర్​ఆర్​ మార్గంలో ప్రయాణించే వారికి శుభవార్త

 భాగ్యనగరం చుట్టూ ఉన్న బాహ్యవలయ రహదారికి త్వరలో మహార్ధశ పట్టనుంది. 159 కి.మి. పొడవు ఉన్న రహదారిలో ప్రయాణికుల సౌకర్యార్థం వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. బాహ్యవలయ రహదారిలో వాహనచోదకుల కోసం అత్యవసర సేవలు, ప్రజా వినియోగ వసతులు కల్పన అంశంపై నామినేటెడ్​ ఎమ్మెల్సీ డి.రాజేశ్వర్​ రావు అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్​ సమాధానం ఇచ్చారు.  

 159 కి.మీ. ఉన్న బాహ్య వలయ రహదారి మార్గంలో వసతుల కల్పనకు తీసుకున్న చర్యలు ప్రణాళికల దశలో ఉన్నాయని మంత్రి కేటీఆర్​ తెలిపారు. ఓఆర్​ఆర్​ మీద ఉన్న 19 ఇంటర్​ ఛేంజ్​లలో మొదటి 10 ఇంటర్​ ఛేంజ్​ల వద్ద పెట్రోల్​ బంకులతో పాటు.. అమెరికా, ఇతర దేశాలలో ఉన్నట్టుగా ఫుడ్​ కోర్టులతో పాటు.. హెచ్​ఎండీఏకు ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాలను అన్వేషిస్తున్నట్లు తెలిపారు. వీటన్నింటినీ ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో నెలకొల్పుతామని మంత్రి కేటీఆర్​ వివరించారు. 

ఇదీ చూడండి: Huzurabad Notification: హుజూరాబాద్ ఉపఎన్నికకు నేడే నోటిఫికేషన్ విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.