ETV Bharat / state

హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌: కేటీఆర్ - Another huge investment for Hyderabad

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా హైదరాబాద్‌కు మరో భారీ పెట్టుబడి వచ్చిందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌ను హైదరాబాద్​లో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇది దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ అని చెప్పారు. మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ సానుకూలమని మరోసారి నిరూపితమైందని కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌కు ఒప్పో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌: కేటీఆర్

author img

By

Published : Dec 22, 2020, 1:54 PM IST

Updated : Dec 22, 2020, 4:06 PM IST

ప్రముఖ స్మార్ట్​ఫోన్​ తయారీ సంస్థ ఒప్పో దేశంలోనే మొదటి 5జీ ఇన్నోవేషన్​ ల్యాబ్​ను హైదరాబాద్​లో ప్రారంభించింది. ఆ కంపెనీకి ఉన్న ఆర్​ అండ్​ డీ సెంటర్​లో దీనిని ఏర్పాటు చేసింది. ప్రపంచ వ్యాప్త 5 జీ అభివృద్ధిని ఈ ల్యాబ్​ వేగవంతం చేయనున్నట్లు ఒప్పో తెలిపింది.

మిడిల్​ ఈస్ట్​ ఆసియా, దక్షిణాసియా, ఆఫ్రికా, జపాన్​, ఐరోపా దేశాలకు సంబంధించిన ఇన్నోవేషన్​ కార్యక్రమాలు ఇక్కడ కొనసాగనున్నట్లు వెల్లడించింది. కెమెరా, బ్యాటరీ, పర్ఫామెన్స్​లకు సంబంధించి మరో మూడు ప్రత్యేక ల్యాబ్​లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది.

ల్యాబ్​ ఏర్పాటుపై ట్విట్టర్​ వేదికగా మంత్రి కేటీఆర్​ కూడా ప్రకటన చేశారు. పెట్టుబడులకు హైదరాబాద్‌ సానుకూలమని మరోసారి నిరూపితమైందని పేర్కొన్నారు.

  • Another emphatic endorsement of the innovation ecosystem in Hyderabad 👍

    OPPO sets up its first 5G Innovation Lab in India at Hyderabad https://t.co/9unnQkSTlA

    — KTR (@KTRTRS) December 22, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

Last Updated : Dec 22, 2020, 4:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.