"రాష్ట్రంలో గత ఆరేళ్లలో హైదరాబాద్‌లో రోడ్ల విస్తరణకు నాలుగు రకాల ప్రణాళికలు తీసుకున్నాం. సీఎం కేసీఆర్ సూచన మేరకు మొదటగా ఎస్ఆర్డీపీని అమలు చేశాం. రూ.29,600 కోట్లతో లీ అసోసెయోట్ ఆధ్వర్యంలో పనులను అప్పగించాం. దాంట్లో ఆరు వేల కోట్ల పనులు ప్రారంభించాం. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.
రెండోది హైదరాబాద్‌లో 709 కి.మీ.ల రోడ్ల మెయింటనెన్స్‌కు రూ.1800 కోట్ల రూపాయలతో ప్రైవేటు సంస్థలకు అప్పగించడం జరిగింది. 1,037 మిస్సింగ్ రోడ్లను కూడా దశల వారీగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశాం.
మేము కొత్త రోడ్లు వేయడానికి ప్రణాళికలు వేస్తుంటే కేంద్రం రోడ్లను మూసేస్తుంది. హైదరాబాద్‌లో పలు చోట్ల రోడ్లను ఇవ్వాలని కేంద్రంను కోరినా స్పందన లేదు. రాష్ట్రంలో కంటోన్మెంట్ రోడ్ల విషయంలో ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు అనేక లేఖలు రాశాం. కేంద్ర నుంచి ఉలుకు పలుకు లేదు. భాజపా ఎమ్మెల్సీ రామచంద్రరావు, పలువురు నేతలు కూడా రాష్ట్రానికి రావాల్సిన రహదారుల విషయంలో స్పందించి కేంద్రానికి చెప్పాలి."
- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
ఇదీ చూడండి : కొండపోచమ్మ జలాశయం కట్టకు బుంగ