ETV Bharat / state

ఎస్​ఆర్​డీపీ పనులపై మంత్రి కేటీఆర్​ సమీక్ష - minister ktr review on srdp

జీహెచ్​ఎంసీ పరిధిలో చేపడుతున్న ఎస్​ఆర్​డీపీ పనులపై పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ సమీక్షించారు. రోజంతా పనులు జరిగేలా... అదనపు మెటీరియల్​, ట్రాఫిక్​ డైవర్ట్​ చేయాలని, మ్యాన్​పవర్​ అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

minister ktr review on srdp works
ఎస్​ఆర్​డీపీ పనులపై మంత్రి కేటీఆర్​ సమీక్ష
author img

By

Published : Feb 25, 2020, 12:25 AM IST

ఎస్​ఆర్​డీపీ కింద చేపట్టిన అన్ని పనులు వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఇంజినీర్లను రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కేటీఆర్​ ఆదేశించారు. జీహెచ్​ఎంసీ కార్యాలయంలో ఇంజినీరింగ్​ అధికారులతో పనుల వారీగా ప్రగతిని సమీక్షించారు. మౌలిక వసతుల అభివృద్ధికి, సులభ రవాణాకు నిర్మిస్తున్న పైవంతెనలు, అండర్ పాస్​లు, ఇతర పనులు ఏకకాలంలో చేసేందుకు అదనపు మెటీరియల్, మ్యాన్ ​పవర్, యంత్రాలను అందుబాటులో ఉంచాలన్నారు.

ప్రస్తుతం రోజుకు ఐదారు గంటలు మాత్రమే జరుగుతున్న పనులను 24 గంటలు కొనసాగించాలని కేటీఆర్​ ఆదేశించారు. మూసీ, ట్రాఫిక్​ డైవర్ట్​ చేసేందుకు పోలీసుల అధికారులతో మాట్లాడాలని సూచించారు. సమావేశంలో మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జీహెచ్​ఎంసీ కమిషనర్ డీఎస్​ లోకేశ్​​ కుమార్​, చీఫ్​ ఇంజినీర్​ శ్రీధర్​, డిస్కం​, ఇంజినీరింగ్​ అధికారులు పాల్గొన్నారు.

ఎస్​ఆర్​డీపీ పనులపై మంత్రి కేటీఆర్​ సమీక్ష

ఇదీ చూడండి: '300 బిలియన్​ డాలర్ల రక్షణ ఒప్పందాలపై రేపు సంతకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.