ETV Bharat / state

నాలాల పూడికతీతకే అత్యంత ప్రాధాన్యం: మంత్రి కేటీఆర్

author img

By

Published : Apr 5, 2021, 10:47 PM IST

గ్రేటర్ హైదరాబాద్​లో నాలాల పూడికతీత, విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను ముమ్మరంగా చేసేందుకు ప్రతి జోన్​కి ప్రత్యేకంగా ఒక చీఫ్ ఇంజినీర్​, పర్యవేక్షక అధికారిని నియమిస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పారిశుద్ధ్య, రహదారుల అభివృద్ధి, నాలా విస్తరణ కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్ష దాదాపు నాలుగు గంటలు కొనసాగింది. అదనపు యంత్రాలు, మానవ వనరులను ఉపయోగించి పూడిక పనులు వేగంగా పూర్తి చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు.

Minister ktr review
మంత్రి కేటీఆర్

నాలాల పూడికతీత, విస్తరణ, ఆక్రమణల తొలగింపు పనులను ముమ్మరంగా చేపట్టాలని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పూడికతీత పనులను అత్యంత ప్రాధాన్యత గల పనుల్లో చేరుస్తున్నామన్నారు. వీటి కోసం నిధులు విడుదల చేసేందుకు ప్రత్యేకంగా గ్రీన్ ఛానెల్​ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నగర అభివృద్ధి, సామాన్య ప్రజానీకం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నాలాలలోని ఆక్రమణలను, అడ్డంకులను తొలగించాలని, అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపులో నిరాశ్రయులైన వారికి రెండు పడకల ఇళ్లు వెంటనే కేటాయించాలని ఆదేశించారు.

అభివృద్ధిపై సమీక్ష...

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అంతకముందు బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి కేటీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నాలా విస్తరణ, అడ్డంకుల తొలగింపు పనులను సంబంధించి ప్రభుత్వమే నిధులు పూర్తిగా మంజూరు చేస్తుందని వివరించారు.

పనులు ముమ్మరం...

ఈ విషయంలో స్వల్ప కాలిక పనులను పరిపాలన సంబంధిత అనుమతులను మంజూరు చేయనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. నగరంలో లింక్ రోడ్ల నిర్మాణం, సీఆర్ఎంపీ పనుల పురోగతి ముమ్మరంగా సాగుతోందన్నారు. ముఖ్యంగా వివిధ ప్రాజెక్టుల భూసేకరణకై రూ. 2,800 కోట్ల విలువైన టీడీఆర్​లను అందచేయడం దేశంలో ఎక్కాడా జరగలేదని... ఈ విషయంలో కమిషనర్ లోకేశ్​కుమార్, చీఫ్ సిటీ ప్లానర్ దేవేందర్​రెడ్డిని మంత్రి అభినందించారు.

హైదరాబాద్​ ముందంజ...

మౌలిక సదుపాయాల కల్పన, వినూత్న కార్యక్రమాల అమలులో హైదరాబాద్... దేశంలోని ఇతర నగరాలకన్నా ముందంజలో ఉందన్నారు. ఎస్ఆర్డీపీ కార్యక్రమంలో చేపట్టిన పనుల్లో దాదాపు 21 ప్రాజెక్టులు నగర వాసులకు అందుబాటులో వచ్చాయని... మరో 17 ప్రాజెక్టులు కూడా త్వరలోనే పూర్తికానున్నాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. నగరంలోని చెరువులను సుందర తటాకాలుగా అభివృద్ధి చేయాలన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడే మరిన్ని వినూత్న కార్యక్రమాలను రూపొందించాలని అధికారులకు సూచించారు.

మరింత శ్రద్ధగా...

నగరంలో పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వహణపై మరింత శ్రద్ధ వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ విషయంలో జోనల్ కమిషనర్లు రోజూ ఉదయం వేళలో క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సర్కిళ్ల వారిగా పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఆడిట్ నిర్వహించాలని తెలిపారు. ప్రతి సర్కిల్​లో ఎన్ని నివాసాలున్నాయి? శానిటైజేషన్ సిబ్బంది ఎంత మంది ఉన్నారు? ఇళ్లలో నుంచి చెత్త సేకరణకు ఎన్ని స్వచ్ఛ ఆటోలున్నాయి? అదనంగా ఎన్ని కావాలి? తదితర అంశాలపై ఆడిట్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. నగర పౌరుల సదుపాయాలకై ఏర్పాటు చేసిన పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ మరింత సమర్థంగా చేపట్టాలని ఆదేశించారు.

ఇదీ చూడండి: రోజుకు 20 కేసులు మాత్రమే విచారణ చేపట్టాలి: హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.