ETV Bharat / state

'దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో'

author img

By

Published : Feb 5, 2020, 4:42 PM IST

Updated : Feb 5, 2020, 8:38 PM IST

మెట్రోరైల్ మూడో కారిడార్ ప్రారంభోత్సవ ఏర్పాట్లపై నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు, మెట్రో రైల్, పోలీసు అధికారులతో మంత్రి కేటీఆర్‌ సమీక్షించారు. ఈనెల 7న సీఎం కేసీఆర్​ చేతుల మీదుగా జరిగే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ktr
ktr
'దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌గా హైదరాబాద్ మెట్రో'

జేబీఎస్ - ఎంజీబీఎస్​ కారిడార్ ప్రారంభంతో హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలో రెండో అతిపెద్ద మెట్రో నెట్ వర్క్​గా అవతరిస్తుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఈనెల 7న ప్రారంభించనున్న మూడో కారిడార్ ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను మంత్రి తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, మెట్రో రైల్, పోలీస్ అధికారులతో ప్రగతి భవన్​లో కేటీఆర్ సమీక్షించారు.

పగడ్బందీ ఏర్పాట్లు

ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్న మంత్రి... ఇందుకోసం తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కారిడార్ పరిధిలోని ప్రజాప్రతినిధులతో పాటు, నగర ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కార్యక్రమం సజావుగా సాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులను కేటీఆర్ ఆదేశించారు.

హైదరాబాద్​ మెట్రో విశిష్టతను వివరిద్దాం...

హైదరాబాద్ మెట్రోరైలు ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్ షిప్ ప్రాజెక్టని... నిర్మాణంలో అందుకున్న మైలురాళ్లు, అవార్డుల వంటి అంశాలను ప్రజలకు వివరించాలని మంత్రి సూచించారు. మెట్రోరైల్ ప్రాజెక్టు సమగ్ర వివరాలు, ప్రస్తుతం ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలు, గణాంకాలతో కూడిన వివరాలతో అధికారులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: ఎంజీబీఎస్‌ - జేబీఎస్‌ మెట్రోరైలును ప్రారంభించనున్న సీఎం

Last Updated : Feb 5, 2020, 8:38 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.