హైదరాబాద్‌లో మెట్రో ట్రైన్ సేవలను ఉదయం 6 గంటల నుంచే ప్రయాణికులకు అందుబాటులోకి తేవాలని.. అభినవ్(KTR tweet on metro) అనే ప్రయాణికుడి ట్విట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ఉదయం 6 గంటల నుంచే మెట్రో రైలు(KTR tweet on metro) కోసం ప్రయాణికులు స్టేషన్లకు వస్తున్నారని చెప్పారు. కానీ 7 గంటలకు ప్రారంభమవుతుండటంతో సుమారు గంటపాటు వేచిచూడాల్సి వస్తోందని తెలిపారు. అందుకు సంబంధించిన వీడియోను కేటీఆర్‌కు ట్వీట్ చేశారు.
ఉదయం సమయంలో క్యాబ్ రేట్లు అధికంగా ఉంటున్నాయని అభినవ్ ట్వీట్(KTR tweet on metro)లో తెలిపారు. అందువల్ల మెట్రో సేవలను ముందుకు జరిపే విషయం పరిశీలించాలని కేటీఆర్‌ను కోరారు. స్పందించిన మంత్రి కేటీఆర్... ఉదయం 6 గంటల నుంచే మెట్రో సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే అంశం పరిశీలించాలని ఆ సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డికి కేటీఆర్ రీట్వీట్ చేశారు.
ప్రస్తుతం మెట్రో రైళ్లు(KTR tweet on metro) మొదటి స్టేషన్ల నుంచి ఉదయం 7 గంటలకు ప్రారంభం అవుతున్నాయి... చివరి స్టేషన్ నుంచి రాత్రి 10.15 గంటలకు చివరి ట్రైన్ నడుపుతున్నారు.
కర్ఫ్యూ ఆంక్షలకు ముందు నగరంలో ఉదయం 6 గంటలకే మెట్రో సేవలు ప్రారంభమయ్యేవి. కొవిడ్ తీవ్రత, ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మెట్రో ఉదయం 7 గంటలకు మెట్రో సేవలు ప్రారంభం అవుతున్నాయి. ఇటీవల కేసులు తగ్గిపోవడం, వ్యాపార, ఉద్యోగ కార్యాలయాలన్ని యధావిధిగా సాగడంతో.. మెట్రోలో రద్దీ పెరిగింది.
-
I agree with your suggestion Abhinav@md_hmrl and @ltmhyd please coordinate and ensure https://t.co/36OMtyaVxq
— KTR (@KTRTRS) November 8, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">I agree with your suggestion Abhinav@md_hmrl and @ltmhyd please coordinate and ensure https://t.co/36OMtyaVxq
— KTR (@KTRTRS) November 8, 2021I agree with your suggestion Abhinav@md_hmrl and @ltmhyd please coordinate and ensure https://t.co/36OMtyaVxq
— KTR (@KTRTRS) November 8, 2021
ఇదీ చదవండి: key skills for PRO job : పీఆర్వో కావాలంటే.. ఈ స్కిల్స్ ఉండాల్సిందే!