హైదరాబాద్‌లోని విరించి(Virinchi) ఆస్పత్రి ఘటనపై విచారణ వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ (KTR).. ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావును ఆదేశించారు. విరించి ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వంశీకృష్ణ అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడంటూ మంత్రి కేటీఆర్కు.. ముబషిర్ అనే వ్యక్తి ట్వీట్(Tweet) చేశారు. ఆస్పత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
గతేడాది వైద్యుల నిర్లక్ష్యం, అధిక ఫీజుల వసూలు వంటి కారణాలతో విరించి ఆస్పత్రి (Virinchi) లైసెన్స్ రద్దయిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. గురువారం కూడా ఇదే తరహా ఘటన పునరావృతమైందని ముబషిర్ ట్విట్టర్‌లో ప్రస్తావించారు. విచారణ ముగిసే వరకు సంబంధిత ఆస్పత్రిని మూసేయాలని నెటిజన్ విజ్ఞప్తి చేయగా.. స్పందించిన మంత్రి కేటీఆర్ (KTR) విషయాన్ని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లారు. విచారణ వేగవంతం చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
-
Request @drgsrao Garu to investigate further https://t.co/qGbFqswdkh
— KTR (@KTRTRS) May 28, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Request @drgsrao Garu to investigate further https://t.co/qGbFqswdkh
— KTR (@KTRTRS) May 28, 2021Request @drgsrao Garu to investigate further https://t.co/qGbFqswdkh
— KTR (@KTRTRS) May 28, 2021
ఇదీ చూడండి: ktr: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుతోంది: కేటీఆర్