ETV Bharat / state

దేశ ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్రవాటా... నివేదిక విడుదల చేసిన కేటీఆర్

దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటా 10. 61 శాతం నుంచి 11.58కి పెరిగినట్లు పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పరిశ్రమల శాఖ వార్షిక నివేదికను విడుదల చేసిన మంత్రి... టీఎస్ఐపాస్ ద్వారా ఇప్పటి వరకు రూ. లక్షా 96 వేల కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు ప్రకటించారు. మరో రూ. 45వేల కోట్లకు పైగా పెట్టుబడులు, వాటి ద్వారా 83 వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని అన్నారు. జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో 35 శాతం రాష్ట్ర వాటాను కొనసాగించిందని కేటీఆర్ తెలిపారు.

Minister ktr released industries report today in Hyderabad
దేశ ఎగుమతుల్లో పెరిగిన రాష్ట్రవాటా... నివేదిక విడుదల చేసిన కేటీఆర్
author img

By

Published : Jun 23, 2020, 9:44 PM IST

పరిశ్రమల శాఖ వార్షిక ప్రగతి నివేదికను మంత్రి కేటీఆర్ విడుదల చేశారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్​రంజన్​తో కలిసి నివేదికను విడుదల చేసిన మంత్రి... జాతీయ జీఎస్​డీపీ సగటుతో పోలిస్తే తెలంగాణ 8.2 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసిందని తెలిపారు. జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా గత ఏడాది నమోదైన 4.55 శాతంతో పోలిస్తే 2019- 20 సంవత్సరానికి 4.76 శాతంగా నమోదైందని అన్నారు. తలసరి ఆదాయం విషయంలోనూ జాతీయ సగటు రూ. 1,34,432తో పోల్చినప్పుడు రాష్ట్ర ఆదాయం రూ. 2,28,216గా నమోదైందని కేటీఆర్ తెలిపారు.

పెరిగిన ఎగుమతుల శాతం..

దేశ ఎగుమతుల్లోనూ... తెలంగాణ వాటా 10.61 శాతం నుంచి 11.58 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విప్లవాత్మక టీఎస్ఐపాస్ విధానం అద్భుతమైన ఫలితాలను అందించిందని, ముఖ్యంగా సరళతర వాణిజ్య విధానంలో మొదటి స్థానంలో నిలిచే అవకాశం కల్పించిందని అన్నారు. టీఎస్ఐపాస్ ఇప్పటిదాకా ద్వారా వచ్చిన పెట్టుబడుల మొత్తం సంఖ్య రూ. 1,96,404 కోట్లు నమోదైందన్నారు. అనుమతులు పొందిన 12,021 పరిశ్రమల్లో 75 శాతానికి పైగా తమ కార్యకలాపాలను ప్రారంభించాయని కేటీఆర్ వివరించారు.

హైదరాబాద్​కు ప్రథమస్థానం..

రానున్న రోజుల్లో సుమారు రూ. 45,848 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి మెగా ఇన్వెస్ట్​మెంట్ ప్రాజెక్టుల రూపంలో రానున్నాయని... తద్వారా సుమారు 83 వేల మందికి ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెప్పారు. భారతదేశంలోనే అత్యధికంగా నెట్ ఆఫీస్ అబ్సార్​ప్షన్ విషయంలో హైదరాబాద్ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అన్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభంలోనూ... తెలంగాణలోని పరిశ్రమలు పెద్దఎత్తున ప్రభుత్వానికి అండగా నిలిచాయన్న కేటీఆర్... సుమారు సుమారు రూ. 150 కోట్లకు పైగా నిధులను, ఇతరత్రా రూపంలో అందించాయని తెలిపారు.

మరింత బలోపేతం..

ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకొని జాతీయ ఫార్మా ఉత్పత్తుల్లో తన వాటాను 35 శాతంగా కొనసాగించిందని మంత్రి ప్రకటించారు. రానున్న దశాబ్దకాలంలో ఈ విలువను వంద బిలియన్ డాలర్లకు పెంచడం వల్ల నాలుగు లక్షల కొత్త ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు.

కేంద్రం నుంచి అవార్డు..

ఏరోస్పేస్, డిఫెన్స్ సెక్టార్​కి సంబంధించి కేంద్రం నుంచి ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ అవార్డు అందుకకొందన్న కేటీఆర్... హైదరాబాద్ జీఎంఆర్ విమానాశ్రయం ప్రపంచంలోనే మూడో గ్రోయింగ్ ఎయిర్ పోర్టుగా అవార్డు అందుకుందని చెప్పారు. రూ. 350 కోట్ల రూపాయలతో జీఎంఆర్ బిజినెస్ పార్క్​ను శంషాబాద్​లో ఏర్పాటు చేస్తుందని తెలిపారు.

60 ఎకరాల్లో...

సిరిసిల్లలో 60 ఎకరాల్లో అప్పారెల్ పార్క్​ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని, మరో చేనేత పార్క్​ను కూడా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గచ్చిబౌలిలో అతిపెద్ద డెలివరీ సెంటర్​ను అమెజాన్ సంస్థ ప్రారంభించిందన్న మంత్రి... వాల్ మార్ట్ తన ఐదో స్టోర్​ను వరంగల్​లో ప్రారంభించిందని తెలిపారు. ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో సుమారు 18 సూక్ష్మ,చిన్న, మధ్యతరహా పరిశ్రమలను పునరుద్ధరించినట్లు కేటీఆర్ చెప్పారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఇండియా ఎకనామిక్ సమ్మిట్, బయో ఏషియా, వింగ్స్ ఇండియా, ఎలక్ట్రిక్ వెహికల్ సమ్మిట్, వరల్డ్ డిజైన్ అసెంబ్లీ, హైదరాబాద్ డిజైన్ వీక్, జాతీయ చేనేత దినోత్సవం తదితర జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు అనుకూల వాతావరణాన్ని వివరించి పరిశ్రమలను ఆకర్షించినట్లు తెలిపారు.

ఇవీ చూడండి: హైదరాబాద్‌ బస్ భవన్‌లో ఇద్దరికి కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.