ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ కుటుంబసమేతంగా మొక్కలు నాటారు. కోటి వృక్షార్చనలో భాగంగా ప్రగతిభవన్లో ఆయన సతీమణి శైలిమ, కూతురు అలేఖ్యతో కలిసి మొక్కలు నాటారు. తనకు జన్మనిచ్చి... నిత్యం స్ఫూర్తిని అందించే కేసీఆర్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు మంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: కేసీఆర్ మా తండ్రి కావడం అదృష్టం: కేటీఆర్, కవిత