ETV Bharat / state

Telangana decade celebrations at T hub : 'టీ హబ్‌ను చూస్తే ప్రభుత్వ ముందుచూపు తెలుస్తుంది' - Minister KTR speech

Industrial Progress Festivals at T hub : తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య నమూనాగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ అభివర్ణించారు. పారిశ్రామిక ప్రగతితోపాటు ఆర్థిక, సామాజిక ప్రగతిని సమాంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని టీహబ్​లో జరిగే తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో పాల్గొని.. ప్రసంగించారు.

KTR
KTR
author img

By

Published : Jun 6, 2023, 8:52 PM IST

Updated : Jun 6, 2023, 10:55 PM IST

Industrial Progress Festivals at T hub on KTR speech : టీ హబ్‌ను చూస్తే తెలంగాణ ప్రభుత్వ ముందు చూపు తెలుస్తుందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. టీహబ్‌లో జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి జయేశ్​ రంజన్​తో కలిసి ఆయన హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా తొమ్మిదేళ్లలో తెలంగాణ సాధించిన పారిశ్రామిక ప్రగతిపై లఘు చిత్రం ప్రదర్శించారు. అనంతరం పలువురు పారిశ్రామికవేత్తలను సన్మానించారు. తెలంగాణ దశాబ్ది పారిశ్రామిక ప్రగతి నివేదిక, చేనేత రంగం అభివృద్ధి నివేదికను ఈ సందర్భంగా కేటీఆర్​ విడుదల చేశారు.

అనంతరం మాట్లాడిన మంత్రి.. 'తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ప్రస్థానం ఇప్పుడే మొదలైంది.. ఇది ట్రయల్ మాత్రమే.. రాబోయే పదేళ్లల్లో అద్భుతమైన పురోగతి చూస్తారని' పేర్కొన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో యువతకి సాధ్యమైనన్ని ఎక్కువ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. తెలంగాణ మోడల్ అంటే సమగ్ర, సమీకృత, సమ్మిళిత, సమతుల్య నమూనాగా కేటీఆర్​ అభివర్ణించారు. పారిశ్రామిక ప్రగతితోపాటు ఆర్థిక, సామాజిక ప్రగతితో రాష్ట్ర ప్రభుత్వం సమాంతరంగా ముందుకు తీసుకెళుతోందని తెలిపారు.

రూ.3 లక్షల 17 వేలతో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం రాష్ట్రంగా తెలంగాణ నిలిచినట్లు ప్రకటించారు. రాష్ట్ర జీఎస్​డీపీ 2014 లో ఉన్న రూ.5 లక్షల కోట్ల నుంచి రూ. 13.27 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపారు. 2014లో ఉన్న ఐటీ ఎగుమతులు రూ.57 వేల కోట్ల నుంచి రూ. 2.40 లక్షల కోట్లకు చేరాయని పేర్కొన్నారు. ఐటీ మొదలుకొని వ్యవసాయ రంగం దాకా అన్ని రంగాల్లోనూ తెలంగాణ ప్రగతి ప్రస్థానం కొనసాగిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

KTR speech on Decade Celebrations at T hub : గ్రామీణ, పట్టణ,పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అందరి ప్రగతికి తమ ప్రభుత్వం పాటు పడుతున్నట్లు తెలిపారు. 2014లో జరిగిన సమావేశంలో ఇన్నోవేషన్ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తామని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్న మంత్రి.. ఆ మాట మేరకు ఈ రోజు దేశంలోనే అతి పెద్ద టీ హబ్, టీ వర్క్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

"తెలంగాణ వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్‌గా మారింది. ప్రపంచం, దేశానికి ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్న ఇంటింటికీ తాగునీరు అందించే మిషన్ భగీరథ, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం పట్ల గర్వంగా ఉంది. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, పర్యావరణం ఇలా అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలుస్తోంది. తెలంగాణ ప్రజలు 2014లో ఉన్న పరిస్థితులను ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితిని బేరిజు వేసుకోవాలి." - కేటీఆర్, ఐటీ శాఖ మంత్రి

'టీ హబ్‌ను చూస్తే ప్రభుత్వ ముందుచూపు తెలుస్తుంది'

ఇవీ చదవండి:

Last Updated : Jun 6, 2023, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.