KTR about Textiles GST : వస్త్ర పరిశ్రమ పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరిని పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మరోమారు తప్పుపట్టారు. వస్త్రపరిశ్రమపై జీఎస్టీ పెంపు విషయమై ట్విటర్ వేదికగా మరోసారి స్పందించారు. మేకిన్ ఇండియా అంటూ రోజూ ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం... స్వదేశంలో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమకు సహకారం అందించాల్సింది పోయి.. జీఎస్టీని 5 నుంచి 12 శాతానికి పెంచారని కేటీఆర్ ఆక్షేపించారు. జీఎస్టీ పెంపు వస్త్ర పరిశ్రమకు మరణశాసనమే అవుతుందని మంత్రి మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రం ద్వంద్వ వైఖరి
జాతీయ చేనేత దివోత్సవం రోజు... చేయూతనిస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఈ విషయంలో జోక్యం చేసుకొని నేతన్నలను కాపాడాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అటు నియోజకవర్గాల పునర్విభజన విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. జమ్ముకశ్మీర్‌కు ఒక నిబంధన... దక్షిణాదికి మరో నిబంధననా? అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న వారు ప్రజలను వేరుగా చూడడం విడ్డూరమని ఆక్షేపించారు.
-
మగ్గంపై పిడుగు👇 వస్త్ర పరిశ్రమపై #GST బాదుడు
— KTR (@KTRTRS) December 24, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
మేకిన్ ఇండియా అంటూ రోజు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం… స్వదేశంలో వస్త్రాలు తయారు వస్త్ర పరిశ్రమకు సహకారం అదించాల్సింది పోయి… 5% ఉన్న GSTని 12% కి పెంచి పరిశ్రమకు మరణ శాసనం రాస్తుంది#Handlooms #Telangana #ReviseGSTonHandlooms pic.twitter.com/tPI6Kc0IPp
">మగ్గంపై పిడుగు👇 వస్త్ర పరిశ్రమపై #GST బాదుడు
— KTR (@KTRTRS) December 24, 2021
మేకిన్ ఇండియా అంటూ రోజు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం… స్వదేశంలో వస్త్రాలు తయారు వస్త్ర పరిశ్రమకు సహకారం అదించాల్సింది పోయి… 5% ఉన్న GSTని 12% కి పెంచి పరిశ్రమకు మరణ శాసనం రాస్తుంది#Handlooms #Telangana #ReviseGSTonHandlooms pic.twitter.com/tPI6Kc0IPpమగ్గంపై పిడుగు👇 వస్త్ర పరిశ్రమపై #GST బాదుడు
— KTR (@KTRTRS) December 24, 2021
మేకిన్ ఇండియా అంటూ రోజు ఉపన్యాసాలు ఇచ్చే కేంద్రం… స్వదేశంలో వస్త్రాలు తయారు వస్త్ర పరిశ్రమకు సహకారం అదించాల్సింది పోయి… 5% ఉన్న GSTని 12% కి పెంచి పరిశ్రమకు మరణ శాసనం రాస్తుంది#Handlooms #Telangana #ReviseGSTonHandlooms pic.twitter.com/tPI6Kc0IPp
వ్యాపారుల ఆందోళన
Merchants worry about GST Hike : దేశంలో వ్యవసాయం రంగం తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వస్త్ర పరిశ్రమ. ఈ ఏడాది అక్టోబరు నాటికి దేశంలో చేనేత, వస్త్ర పరిశ్రమ ద్వారా నాలుగున్నర కోట్ల మంది ఉపాధి పొందుతున్నట్లు అంచనా. ఇందులో చేనేత రంగం ద్వారా 35.22 లక్షల మంది ఉపాధి పొందుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018-19 ఆర్థిక సంవత్సరపు లెక్కల ప్రకారం... ఉత్పత్తిలో చేనేత పరిశ్రమది ఏడు శాతం ఉండగా... జీడీపీలో 2శాతం ఉంది. కరోనా కారణంగా గడిచిన రెండేళ్లుగా తీవ్ర ఒడుదొడుకులకులోనైన వస్త్రపరిశ్రమ... ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఈ నేపథ్యంలో 5 శాతంగా ఉన్న జీఎస్టీని 12శాతానికి పెంచడం వస్త్రవ్యాపారులకు గోరుచుట్టుపై రోకలి పోటులా మారింది.
వస్త్రవ్యాపారం కుదేలు
GST Increase on textile industry : నిత్యావసరాల్లో ఒకటైన వస్త్రంపై పన్ను తగ్గించాల్సిందిపోయి... పెంచడం ఏంటని వ్యాపార వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. వినియోగదారుల నుంచి వసూలు చేసి ప్రభుత్వానికి చెల్లించే పన్నే అయినప్పటికీ... వ్యాపార వర్గాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. పెంచిన జీఎస్టీని తగ్గించాలని వ్యాపార వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పులపై ఆధారపడి జరిగే వస్త్ర వ్యాపారం కుదేలవుతుందని... ఆర్థిక స్థోమత తక్కువ ఉన్న వారంతా రోడ్డున పడతారని టెక్స్‌టైల్ వ్యాపారుల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది. జీఎస్టీ పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
వస్త్రవ్యాపారం కనుమరుగయ్యే అవకాశం
2011 జనాభా లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 43.3 లక్షల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడ్డాయి. తాజా గణాంకాల మేరకు ఆ సంఖ్య 30.44 లక్షల కుటుంబాలకు పడిపోయింది. అంటే దాదాపు 25% కుటుంబాలు చేనేత పరిశ్రమకు దూరమయ్యాయి. గ్రామీణ ఆధారిత ఉపాధి అవకాశాలు కల్పించే చేనేత రంగాన్ని ఒక పరిశ్రమగా కాకుండా... గాంధీ మహాత్ముని ఆలోచనల మేరకు పూర్తి పన్ను మినహాయింపు ఇవ్వాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చేనేత రంగంలో తక్కువ ఆదాయం, క్లిష్టమైన పరిశ్రమ కావడంతో కొత్త జనరేషన్ ఈ రంగానికి దూరమవుతోంది. భవిష్యత్తులోనూ ఇదే కొనసాగితే చేనేత రంగం కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశంలో ఈ రంగంలో పనిచేస్తున్న 67శాతం కుటుంబాల ఆదాయం రూ.5వేల కంటే తక్కువగా ఉందని, మరో 26 శాతం మంది కుటుంబాల ఆదాయం రూ.10వేల కంటే తక్కువని అంచనా.మొత్తం 93 శాతం చేనేత కుటుంబాల ఆదాయం పదివేలకు మించడం లేదన్నది తాజా లెక్కలు వెల్లడిస్తున్నాయి. పూర్తి స్టోరీ కోసం క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: Ktr Letter On Textile Gst: జీఎస్టీ పెంపు అమలును కేంద్రం విరమించుకోవాలి: కేటీఆర్