ETV Bharat / state

'నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు'

రాష్ట్రంలో నేత కార్మికుల ఆత్మహత్యలు గతకాలం నాటి చేదు జ్ఞాపకాలుగానే ఉండాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. నేతన్నలకు పని కల్పించి వారికి ఆదాయం పెంచాలని సీఎం భావించారని వెల్లడించారు.

'నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు'
'నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసు'
author img

By

Published : Sep 29, 2020, 2:10 PM IST

నేతన్నల కష్టాలేంటో సీఎం కేసీఆర్‌కు బాగా తెలుసన్నారు చేనేత శాఖ మంత్రి కేటీఆర్‌. ఉద్యమ సమయంలో నేతన్నల కష్టాలను స్వయంగా చూశారని పేర్కొన్నారు. ఒక్క నెలలో ఏడుగురు నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం చూసి ఆయన చలించిపోయారని తెలిపారు. నేతన్నలకు పని కల్పించి వారికి ఆదాయం పెంచాలని సీఎం భావించారని వెల్లడించారు. బతుకమ్మ చీరల తయారీ ద్వారానే 26 వేల పవర్‌లూమ్స్‌కు పని కల్పించారన్నారు.

గతకాలంలోనే...

ఈ నాలుగేళ్లలో 4 కోట్ల బతుకమ్మ చీరలను పంపిణీ చేసినట్లు మంత్రి వివరించారు. ప్రభుత్వ విద్యాలయాల్లోని విద్యార్థుల యూనిఫారాలు కూడా నేతన్నలకే అప్పగించినట్లు స్పష్టం చేశారు. నేత కార్మికుల ఆత్మహత్యలు గతకాలం నాటి చేదు జ్ఞాపకాలుగానే ఉండాలని ఆకాంక్షించారు. రైతుల ఆత్మహత్యలు త్వరగా తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందుందని కేంద్రమే చెప్పిందని గుర్తుచేశారు. రాయితీపై అప్‌గ్రేడ్‌ పవర్‌లూమ్స్‌ను కార్మికులకు అందిస్తున్నట్లు తెలిపారు.

ఈసారి 287 డిజైన్లలో...

బతుకమ్మ చీరలు గతేడాది 100 డిజైన్లలో ఉంటే ఈ ఏడాది 287 డిజైన్లలో చీరల తయారీ జరిగినట్లు ఉద్ఘాటించారు. తెలంగాణ నేత కార్మికులు ఇతర రాష్ట్రాల టెండర్లను కూడా దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు ఏవీ ఆగలేదని పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల జీతాలు కోత పెట్టుకున్నాం గానీ పేదలకు నిధులు ఆపలేదని మంత్రి అన్నారు.

ఇదీ చూడండి: రెవెన్యూ సమస్యలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.