మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సుదీర్ఘ సమావేశం ముగిసింది. మున్సిపాలిటీల వారీగా మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. మున్సిపాలిటీల్లోని సమస్యలను మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యేలు వివరించారు.
పట్టణాల్లో దీర్ఘకాలిక సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి కేటీఆర్ శాసన సభ్యులకు హామీ ఇచ్చారు. ప్రజల ఆస్తులపై వారికి శాశ్వత హక్కులు కల్పిస్తామని స్పష్టం చేశారు.
భవిష్యత్‌లో ఆస్తుల క్రయవిక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూస్తామని కేటీఆర్ అన్నారు. ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తులను కూడా నమోదు చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఆస్తుల నమోదు ప్రక్రియలో ప్రజలు పాల్గొనేలా చూడాలని ఎమ్మెల్యేలకు కేటీఆర్ సూచించారు.
ఇవీచూడండి: 'వ్యవసాయ బిల్లులు రైతుల పాలిట మరణ శిక్షలు'