Minister KTR legal notices to Revanth Reddy and Bandi Sanjay: టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ వ్యవహారంలోకి రాజకీయ దురుద్దేశంతోనే రేవంత్ రెడ్డి, బండి సంజయ్.. తనను లాగుతున్నారని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు వారి ఇరువురికి మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. తనపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని నోటీసులో పేర్కొన్నారు.
SIT notices to Bandi Sanjay: ఈ వ్యవహారంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఇప్పటికే సిట్ నోటీసులు జారీ చేయగా.. రేపటి సిట్ విచారణకు సంజయ్ హాజరు కావడంలేదని బీజేపీ వర్గాలు తెలిపాయి. తనకు సిట్ నోటీసులు అందలేదని స్పష్టం చేసిన బండి సంజయ్.. సిట్‌పై నమ్మకం లేదని తెలిపారు. సిట్టింగ్ జడ్జితో ఈ కేసు విచారణ జరిపించాలని సంజయ్ డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల వల్ల ప్రస్తుతం దిల్లీలోనే బండి సంజయ్ ఉన్నారు. ఈ నేపథ్యంలో రేపటి విచారణకు ఆయన హాజరు అవుతారా.. లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
Revanth Reddy for SIT investigation: మరోవైపు పేపర్ లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్ పీఏపై ఆరోపణలు చేసిన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ సిట్ విచారణకు హాజరయ్యారు. తన దగ్గర ఉన్న ఆధారాలు సిట్ అధికారులకు సమర్పించినట్లు ఆయన పేర్కొన్నారు. విచారణ అనంతరం మాట్లాడిన రేవంత్‌రెడ్డి.. ప్రతిపక్షాలను ప్రభుత్వం విచారణల పేరుతో భయపెడుతోందని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతునొక్కుతోందని విమర్శించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కూడా సిట్ చర్యలు తీసుకోవాలని తెలిపారు. విచారణలో మంత్రి కేటీఆర్ వద్ద సంపూర్ణమైన సమాచారం ఉందని సిట్ అధికారి ఏఆర్ శ్రీనివాస్‌కు చెప్పినట్లు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నేరస్థులను పోలీసులు విచారించకుండానే మంత్రి కేటీఆర్ పూర్తి సమాచారం చెప్పారని తెలిపారు. కేటీఆర్ నుంచి సమాచారం ఎందుకు సేకరించలేదని రేవంత్ ప్రశ్నించారు.
SIT is preparing to take action against Revanth Reddy: పేపర్ లీక్ కేసులో నిరాధారమైన ఆరోపణలు చేశారనే కోణంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై సిట్ అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు. ఇవాళ్టీ విచారణలో రేవంత్ రెడ్డి తమకు ఎలాంటి ఆధారాలు చూపలేకపోయారని సిట్ తెలిపింది. న్యాయ సలహాలు తీసుకొని ఆయనపై చర్యలు తీసుకుంటామని సిట్ స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
రేవంత్‌రెడ్డిపై చర్యలకు సిద్ధపడుతున్న సిట్ అధికారులు
'సిట్ అంటేనే కేసీఆర్ కిట్.. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే..'
ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం.. కేటీఆర్, బండి సంజయ్ ట్వీట్ల వార్