ఇనిషియేటివ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతికతలు అందుబాటులోకి వచ్చాయి. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీలో 'ఇంటెలిజెంట్ సొల్యూషన్ ఫర్ రోడ్ సేఫ్టీ త్రూ టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ తెలంగాణ'ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. బస్సు ప్రమాదాలు ముందుగానే పసిగట్టి.. అప్రమత్తం చేసే సాంకేతికత, కారులో రక్షణ వ్యవస్థను పరిపుష్టం చేసే సరికొత్త ప్రక్రియను మంత్రి ప్రారంభించారు.
జాతీయ రహదారులపై వెళ్లే టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురి కాకుండా అప్రమత్తం చేసేందుకు ఈ సాంకేతికతను వినియోగిస్తారని మంత్రి కేటీఆర్ తెలిపారు. పెరుగుతున్న టెక్నాలజీతో యువకులకు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.
ఇవీ చూడండి..