ETV Bharat / state

owaisi midhani flyover : ఓవైసీ, మిధాని కూడళ్లలో తీరనున్న ట్రాఫిక్‌ చిక్కులు

author img

By

Published : Dec 28, 2021, 4:42 AM IST

Updated : Dec 28, 2021, 7:58 AM IST

owaisi midhani flyover : విశ్వనగరంగా ఎదుగుతోన్న హైదరాబాద్ నగరానికి... అంతే స్థాయిలో మౌలికవసతులు, అభివృద్ధి హంగులు అద్దుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ఎస్​ఆర్​డీపీతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ రద్దీని తగ్గించటమే కాక... పైవంతెనలు, అండర్​పాస్‌ల నిర్మాణంతో పలు ప్రాంతాల రూపురేఖలే మారుస్తోంది. అటువంటి మరో కలికితురాయి భాగ్యనగరి శిఖలో చేరేందుకు సిద్ధమైంది.

owaisi midhani flyover
owaisi midhani flyover
ఓవైసీ, మిధాని కూడళ్లలో తీరనున్న ట్రాఫిక్‌ చిక్కులు

owaisi midhani flyover : జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో ఓవైసీ, మిధాని జంక్షన్లలో... నిర్మాణమైన పైవంతెనను కేటీఆర్‌ ఇవాళ ప్రారంభించనున్నారు. జీహెచ్​ఎంసీ ఆధ్వర్యంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు కింద చేపట్టిన ఈ పైవంతెన నిర్మాణాన్ని... 2018లో చేపట్టారు. రూ.63 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమై... రెండున్నరేళ్ల కాలంలో పూర్తైన ఈ ప్రాజెక్టుకు 80 కోట్ల వ్యయమైంది. డీఆర్​డీఎల్​, మిధాని కూడలి నుంచి ప్రారంభమయ్యే ఈ పైవంతెన... 1.365 కిలోమీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పుతో మూడు వరుసల వంతెనగా నిర్మితమైంది.

వీరికి ఉపయోగం...

మెహదీపట్నం, చాంద్రాయణగుట్ట, మిధాని నుంచి వచ్చే వాహనదారులు... ఈ పైవంతెన ద్వారా మందమల్లమ్మ, సంతోష్‌నగర్, సాగర్ రింగ్ రోడ్డు, ఎల్బీనగర్ ప్రాంతాలకు సునాయాసంగా చేరుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ ద్వారా చాంద్రాయణగుట్ట - కర్మాన్‌ఘాట్ మార్గాల గుండా వెళ్లే వాహనదారులకు ఇంధన వ్యయం, ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని హర్షం వ్యక్తమవుతోంది.

భవిష్యత్​ అవసరాలు దృష్టిలో పెట్టుకుని..

ఈ మార్గంలో ప్రస్తుత రద్దీ సమయంలో గంటకు.. 11 వేల పైచిలుకు వాహనాల రాకపోకలు సాగిస్తుండగా.. 2030 కల్లా 17 వేల పైచిలుకు వాహనాలు తిరుగుతాయని అంచనావేశారు. ఈ మేరకు భవిష్యత్‌లో ట్రాఫిక్ చిక్కులు ఎదురుకాకుండా ఈ పైవంతెన దోహదపడుతుందని జీహెచ్​ఎంసీ అధికారులు తెలిపారు. నగరం తూర్పు ప్రాంతానికి, పాతబస్తీకి వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. విస్తృత ప్రాధాన్యమున్న ఈ ఫ్లైఓవర్‌ను పురపాలక శాఖమంత్రి కేటీఆర్​, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ... నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ ఇవాళ ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.

ఇదీ చూడండి: owaisi midhani flyover: ఓవైసీ, మిథాని కూడలి ఫ్లైఓవర్ రెడీ.. రేపే ముహూర్తం..

Last Updated : Dec 28, 2021, 7:58 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.