ETV Bharat / state

హైదరాబాద్‌లో 3 కీలక లింక్‌ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​ - లింకు రోడ్లను ప్రారంభించిన కేటీఆర్​

ఆరేళ్లలో రూ.8 వేల కోట్ల వ్యయంతో హైదరాబాద్​లో మౌలిక సదుపాయాలు కల్పించామని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. గ్రేటర్​లో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు జంట నగరాల్లో మొత్తం 137 లింకు రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. లింకు రోడ్లతో ట్రాఫిర్ రద్దీతో పాటు... కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పారు. ఇవాళ మూడు లింకు రోడ్లను ప్రారంభించగా... మరో అండర్ పాస్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ktr
ktr
author img

By

Published : Nov 9, 2020, 6:54 PM IST

హైదరాబాద్‌లో 3 కీలక లింక్‌ రోడ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్​

గ్రేటర్ హైదరాబాద్​లో మెరుగైన జీవన ప్రమాణాల పెంపునకు గానూ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా గత ఆరేళ్లలో రూ.8,113 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. జనాభాకు తగ్గట్లుగా మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని.. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు. శేరిలింగంపల్లి జోన్ పరిధిలో రూ.67.76 కోట్ల వ్యయంతో నిర్మించిన మూడు లింక్ రోడ్లను ప్రారంభించారు. నందిహిల్స్ రోడ్ నం-45 వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.

చరిత్రలో మరెప్పుడూ లేనివిధంగా

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా మరెప్పుడూ లేనివిధంగా హైదరాబాద్ నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాస్​లు, రహదారుల నిర్మాణం, జంక్షన్ల సుందరీకరణ తదితర పనులను చేపట్టామని మంత్రి తెలిపారు. వీటిలో రూ.6 వేల కోట్లతో ఎస్​ఆర్​డీపీ పనులు, హైదరాబాద్ రోడ్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.313 కోట్ల వ్యయంతో రహదారుల నిర్మాణం, సమర్థ రహదారుల నిర్వహణ కార్యక్రమం కింద రూ.1,800 కోట్ల వ్యయంతో రోడ్ల నిర్వహణ పనులను చేపట్టామని వివరించారు.

అత్యంత వేగంగా

దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్. ఈ నగరాన్ని అభివృద్ధి చేపట్టడానికి శాస్త్రీయ పద్ధతిలో ప్రణాళికలు రూపొందించాం. మెరుగైన జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా హైదరాబాద్​ను మేసర్స్ సంస్థ ప్రకటించింది. మరో ప్రముఖ సంస్థ జేఎల్​ఎల్ కూడా వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమని ప్రకటించింది. నగరంలోని రహదారులపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.313 కోట్లతో 137 లింక్ రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతోనే మెరుగైన పాలన సాధ్యం. నగరంలో మరెక్కడైనా లింక్ రోడ్ల అభివృద్ధికి అవకాశాలు ఉంటే సలహాలు, సూచనలు ఇవ్వండి.

-కేటీఆర్, మంత్రి

మంత్రి ప్రత్యేక శ్రద్ధతో

పాత ముంబయి హైవే నుంచి రోడ్ నం.45 మార్గంలో రూ.23.10 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అండర్ పాస్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. నాలుగు లేన్ల ఈ అండర్ పాస్ నిర్మాణం వల్ల ట్రాఫిక్ రద్దీ గణనీయంగా తగ్గనుంది. పాత ముంబయి హైవే నుంచి ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ మీదుగా దిల్లీ పబ్లిక్ స్కూల్ వరకు రూ.19.51 కోట్లతో 2.30 కిలోమీటర్ల మేర నిర్మించిన లింక్ రోడ్డును ప్రారంభించారు. వీటితో పాటు పాత ముంబయి హైవే లెదర్ పార్కు నుంచి రోడ్ నం.45 హెచ్​టీ లైన్ వరకు రూ.15.54 కోట్లతో 1.20 కిలోమీటర్ల లింక్ రోడ్డు, మియాపూర్ రహదారి నుంచి హెచ్​టీ లైన్ వరకు రూ.9.61 కోట్ల వ్యయంతో కిలోమీటరు దూరంతో నిర్మించిన మరో లింకు రోడ్డును మంత్రి ప్రారంభించారు. మంత్రి ప్రత్యేక శ్రద్ధతో నగరంలో 137 లింక్ రోడ్ల నిర్మాణాలను చేపట్టామని మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. హైదరాబాద్​లో ట్రాఫిక్ కష్టాలు తప్పించడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి : చిరంజీవికి కరోనా... ప్రగతిభవన్​లో కరోనా​ పరీక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.