ETV Bharat / state

incubator startup programme: 'తెలంగాణలోని ఎకోసిస్టమ్​ను వినియోగించుకోండి'

minister ktr in incubator startup challenge programme: మార్కెట్​లోకి విజయవంతమైన వ్యవస్థాపకులుగా రావాలంటే ఒరిజినల్​గా ఉండాలని కేటీఆర్ సూచించారు. తెలంగాణలో ఉన్న ఎకోసిస్టమ్​ను యువ వ్యాపారవేత్తలు వినియోగించుకోవాలని అన్నారు. ఇంక్యూబెటర్ స్టార్ట్ అప్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని మాట్లాడారు.

minister ktr in incubator startup challenge programme hyderabad
'తెలంగాణలోని ఎకోసిస్టమ్​ను వినియోగించుకోండి'
author img

By

Published : Apr 15, 2023, 7:19 PM IST

minister ktr in incubator startup challenge programme: ఓటమిని చూసి డీలాపడకూడదని.. మంత్రి కేటీఆర్ యువ వ్యాపారవేత్తలకు సూచించారు. ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇన్క్యుబేటర్ స్టార్ట్ అప్ ఛాలెంజ్ గ్రాండ్ ఫినాలే కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఐ కేర్ రంగంలో కొత్త సాంకేతికతలను రూపొందించే ఉద్దేశంతో నిర్వహించిన ఇన్య్కుబేటర్ కార్యక్రమంలో 42 అంకురాలు పాల్గొనగా.. 12 అంకురాలు గ్రాండ్ ఫినాలే వరకు చేరుకున్నాయి. మెుదటి మూడు స్థానాల్లో నిలిచిన అంకురాలను మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా సత్కరించారు. మెుదటి స్థానంలో నిలిచిన అంకుర వ్యవస్థాపకులకు 5 లక్షల రూపాయల నగదు బహుమానం అందించారు.

ఈ మేరకు యువ వ్యాపార వేత్తలను ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎకోసిస్టమ్​ను యువ వ్యాపారవేత్తలందురూ వినియోగించుకోవాలని కోరారు. దేశంలో ఇంకా ఎంతో మంది ప్రజలు హెల్త్ కేర్ రంగంలో ఉన్న వసతులను అందుకోలేకపోతున్నారని అన్నారు. హెల్త్ కేర్ రంగంలో రోజు రోజుకు ఖర్చు పెరిగిపోతోందని..పేదలకు కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చేలా హెల్త్ కేర్ రంగంలో వసతులను తక్కువ ఖర్చు అయ్యేలా రూపొందించాలని కేటీఆర్ సూచించారు.

"కొత్త సాంకేతికత గురించి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ మాకు ఎప్పుడూ ఒకటి గుర్తుచేసేవారు. సాంకేతికత సమాజంపై ఎంత ప్రభావం చూపిస్తుందని అడుగుతారు. సమాజంపై సానుకూల ప్రభావం చూపిస్తుందా అని ప్రశ్నిస్తారు. కొత్త వ్యవస్థాపకులకు నేను రెండు విషయాలు చెబుతాను. ఒరిజినల్​గా ఉండండి. కాపీ చేయొద్దు. అమెజాన్​ను చూసి ఫ్లిప్​కార్ట్, స్నాప్​డీల్ వంటివి సృష్టించవచ్చు. ఇది చాలా సులభం. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే సృష్టించినవి కావు. ప్రపంచ స్థాయికి చేరేలా కొత్త ఆవిష్కరణలు చేయండి. ఇప్పటికిప్పుడే వ్యవస్థాపకులుగా మారకపోవచ్చు. ప్రస్తుతం మూలధనం సమస్య కాదు. గతంలో మూలధనం సంపాదించాలంటే సవాల్​గా ఉండేది. డబ్బును సమకూర్చుకుని ఆ తర్వాత ఆలోచనను అమలు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆలోచనే ముఖ్యం. ఆ తర్వాతే మూలధనం. ఎంత తొందరగా మార్కెట్​లోకి వస్తామనేదే ముఖ్యం. ఒరిజినల్​గా ఉండండి. ఓటమి ఎదురైతే పండగ చేసుకోండి"_కేటీఆర్, ఐటి పరిశ్రమల శాఖ మంత్రి

ప్రాంతీయ భాషలో సీఆర్​పీఎఫ్: ప్రాంతీయ భాషలో సీఆర్​పీఎఫ్ పరీక్షలు రాసేందుకు అనుమతించినందుకు కేటీఆర్ హర్షం వ్యక్తం చేశాడు. 13 భాషల్లో రాసేందుకు అనుమతి ఇవ్వడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. దీని వల్ల తెలుగు రాష్ట్రాల నుంచి వేలమందికి లబ్ధి కలుగుతుందని కేటీఆర్ తెలిపారు.

'తెలంగాణలోని ఎకోసిస్టమ్​ను వినియోగించుకోండి'

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.