ETV Bharat / state

కరోనాను ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచనలు చేయాలి: కేటీఆర్ - Minister ktr updates

కరోనాపై పోరులో భారత్‌ తనదైన ముద్ర వేస్తోందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. మహ్మమారిని ఎదుర్కోనేందుకు వినూత్న ఆలోచనలు చేయాలని మంత్రి అన్నారు.

Minister ktr give a message to venchar capitalists
కరోనాను ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచనలు చేయాలి: కేటీఆర్
author img

By

Published : Apr 23, 2020, 8:42 PM IST

Updated : Apr 23, 2020, 9:26 PM IST

కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు వినూత్న ఆలోచనలు చేయాలని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వైరస్ పరిష్కారానికి వెంచర్ క్యాపిటలిస్టులు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. క్యాపిటలిస్ట్‌ వాణి కోలా వీడియో సమావేశంలో మంత్రి ప్రసంగించారు. కరోనాపై పోరులో భారత్‌ తనదైన ముద్ర వేస్తోందని కేటీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలోని స్టార్టప్‌లు కూడా వినూత్న పరిష్కారాలు చూపుతున్నాయని వెల్లడించారు. మెడ్‌టెక్, మెడికల్ డివైస్, బయోటెక్ రంగాల్లో అవకాశాలు పెరుగుతున్నాయని వివరించారు. బెంగళూరులో రూ.100 కోట్లతో వెంచర్‌ క్యాపిటలిస్టులు నిధి ఏర్పాటు చేశారు.

మంత్రి కేటీఆర్ వీడియో కాల్​లో పలు వెంచర్ క్యాపిటలిస్టులు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. దేశంలోని పలువురు వెంచర్ క్యాపిటల్ లిస్టులు కలిసి ఆక్ట్ గ్రాంట్స్ పేరిట సుమారు వంద కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, భారతదేశ స్టార్టప్ కమ్యూనిటీ ఈ అవకాశాన్ని వినియోగించుకొని సరికొత్త ఐడియాలతో కొవిడ్-19ను ఎదుర్కునేందుకు ముందుకు రావాలని మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్ట్, కలారి క్యాపిటల్ ఎండీ వాణి కోలా బెంగళూరు నుంచి ఈ వీడియో సమావేశాన్ని నిర్వహించారు. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ వెంచర్ క్యాపిటలిస్టులు ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఆక్ట్ గ్రాంట్స్ ద్వారా కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు వినూత్నమైన ఆలోచనలకు, ప్రయత్నాలకు సహకారం అందిస్తామని ఈ సందర్భంగా వారు మంత్రి కేటీఆర్​కి తెలియజేశారు.

ప్రపంచం కరోనా మహమ్మారితో ముప్పు ఎదుర్కొంటున్న కాలంలో ఉత్పన్నమయ్యే సమస్యలకు పరిష్కారమార్గంగా ఇందులోని అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేయాలని కేటీఆర్ అన్నారు. ముఖ్యంగా మెడికల్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్, మెడికల్ డివైస్, జినోమ్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి రంగాల్లో కరోనా పలు అవకాశాలను ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం విదేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్న మెడికల్ డివైజెస్ స్థానంలో ఇక్కడి అవసరాలకు అనుగుణంగా వాటిని రూపొందించే కార్యక్రమాన్ని ఇప్పటికే పలువురు చేపట్టారని, ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీవర్క్సు అతి తక్కువ ఖర్చుతో వెంటిలేటర్​ను తయారు చేసిందని గుర్తు చేశారు. ఇలాంటి ప్రయత్నాలు భవిష్యత్తులోనూ కొనసాగిస్తే, తక్కువ ఖర్చుతో నాణ్యమైన మెడికల్ డివైస్​ని మనం తయారుచేసే అవకాశం దొరుకుతుందన్నారు. కరోనా కట్టడి కోసం ముందుకు వచ్చే స్టార్టప్ కంపెనీలకు తమ ప్రభుత్వ మద్దతు కోనసాగుందని, ఇందుకోసం అవసరం అయితే టీహబ్, వీహబ్ , టీవర్క్సు, రిచ్ (RICH), తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ వంటి సంస్ధల సహాకారం తీసుకోవాలని మంత్రి సూచించారు.

కరోనా కోసం వ్యాక్సిన్ ను కనిపెట్టేందుకు 6 బయోటెక్ కంపెనీలు ముందువరుసలో ఉండగా.. ఇందులో ఐదు తెలంగాణ ప్రాంతం నుంచే ఉన్నాయన్నారు. ఇప్పటికీ కరోనాకు ఎలాంటి మందు లేని నేపథ్యంలో ఇన్నోవేషన్ ద్వారానే దానిని ఎదుర్కొనేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుత లాక్​డౌన్ ఎత్తేసిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు రంగాలు తమ ప్రాధాన్యతలను నిర్ణయించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని, ఇందుకోసం సిద్ధంగా ఉండాలని మంత్రి కేటీఆర్ సూచించారు.

ఇవీ చూడండి: మూడు నెలలు అద్దె అడగొద్దు.. ఉత్తర్వులు జారీ

Last Updated : Apr 23, 2020, 9:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.