ETV Bharat / state

ఎన్డీఆర్​ఎఫ్​ నిధులు అడిగే ధైర్యం కిషన్​రెడ్డికి లేదు: కేటీఆర్ - minister ktr fires on union minister kishan reddy

కేంద్రమంత్రి కిషన్​రెడ్డిపై మంత్రి కేటీఆర్​ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రానికి వరద సాయం విషయంలో కిషన్​రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని దుయ్యబట్టారు. సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేసిన కిషన్​రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంపై కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మ‌ర‌ల్చేందుకు కిష‌న్ రెడ్డి నిర్లజ్జగా అబ‌ద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

ఎన్డీఆర్​ఎఫ్​ నిధులు అడిగే ధైర్యం కిషన్​రెడ్డికి లేదు: కేటీఆర్

author img

By

Published : Jul 21, 2022, 10:56 PM IST

రాష్ట్రానికి వరద సాయం విషయంలో కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తప్పుడు లెక్కలు చెబుతున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు కలిసిరాకుండా.. ఎప్పటిలాగే అబద్ధాలు చెబుతున్నారని ఆక్షేపించారు. ఎన్డీఆర్​ఎఫ్, ఎస్డీఆర్​ఎఫ్​ మధ్య తేడా తెలియని వ్యక్తి కేంద్రమంత్రిగా ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఎన్డీఆర్​ఎఫ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన ప్రత్యేక, అదనపు నిధులపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే.. రాష్ట్రానికి రాజ్యంగబద్దంగా, హక్కుగా దక్కే ఎస్డీఆర్​ఎఫ్ గణాంకాల పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్రం చూపుతున్న వివక్ష నుంచి ప్రజల దృష్టి మ‌ర‌ల్చేందుకు కిష‌న్ రెడ్డి నిర్లజ్జగా అబ‌ద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు.

విపత్తులతో సంబంధం లేకుండా రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎస్డీఆర్​ఎఫ్​కు వచ్చే నిధులు తప్ప.. కేంద్రం నుంచి తెలంగాణకు దక్కింది ఏమిటో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన నిధులనూ కేంద్రమే విడుదల చేసినట్లు చెప్పుకోవడం దౌర్భాగ్యమని వ్యాఖ్యానించారు. కేంద్రానికి రాష్ట్రం చెల్లించే పన్నుల నుంచే తిరిగి రాజ్యాంగ పద్ధతుల్లో రాష్ట్రానికి దక్కే మార్గాల్లో ఎస్డీఆర్​ఎఫ్ ఒకటన్న మంత్రి కేటీఆర్.. ఈ విషయం తెలియకపోవడం కేంద్రమంత్రి కిషన్​రెడ్డి అవగాహనాలేమికి నిదర్శనమని మండిపడ్డారు. వరదలు, విపత్తులు వచ్చినప్పుడు.. ముఖ్యంగా హైదరాబాద్ వరదలతో పాటు ప్రస్తుతం వచ్చిన వర్షాలు, వరదల నష్టంపై సాయం చేయాలని కేంద్రాన్ని నిలదీస్తే.. అలవాటైన అబద్ధాలను వల్లెవేస్తున్నారని ఆక్షేపించారు.

వెంటనే క్షమాపణలు చెప్పాలి..: లోక్​సభలో ఈ నెల 19న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ చేసిన ప్రకటనను కిషన్​రెడ్డి ఒకసారి చదవాలని కేటీఆర్​ హితవు పలికారు. 2018 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు ఎన్డీఆర్​ఎఫ్​ ద్వారా అదనంగా ఒక్క రూపాయీ ఇవ్వలేదని ఆ ప్రకటనలో చెప్పిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తన సహచర మంత్రి పార్లమెంట్ సాక్షిగా చేసిన ప్రకటన అవాస్తవమా.. లేక కిషన్​రెడ్డి తన అబద్ధాలతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు. సొంత రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వంపై అభాండాలు వేసిన కిషన్​రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

ఆ నివేదిక ఏమైంది..: ఇటీవలి భారీ వర్షాలతో జరిగిన ప్రాథమిక నష్టం రూ.1,400 కోట్లని తేల్చి ఎన్డీఆర్​ఎఫ్​ నిధులు అందించాలని కేంద్రాన్ని కోరితే.. కేవలం బృందాలను పంపించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. హైదరాబాద్ వరదల అనంతరం కేంద్ర ప్రభుత్వం పంపిన బృందం రూపొందించిన నివేదిక ఏమైందో ప్రజలకు వివరించాలని, ప్రత్యేక సాయం ఎందుకు ఇవ్వలేదో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బృందాల వల్ల రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్న ఆయన.. ప్రజలను ఏమరిచేందుకే కేంద్రం బృందాలను పంపుతోందని ఆక్షేపించారు.

ఎండగట్టడం కొనసాగిస్తాం..: మరోవైపు 2021లో గుజరాత్​లో వరదలు వచ్చినప్పుడు ఆగమేఘాల మీద సర్వే నిర్వహించి రూ. వెయ్యి కోట్ల ఎన్డీఆర్​ఎఫ్​ ప్రత్యేక అదనపు సాయాన్ని అడ్వాన్స్​గా అందించిన ప్రధాని మోదీకి.. తెలంగాణ ప్రజల కష్టాలు కనిపించడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఈ విషయంలో కచ్చితంగా ప్రధానమంత్రి వివక్షపూరిత వైఖరిని ఎండగట్టడం కొనసాగిస్తామని చెప్పారు. ఇతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు బృందాలను, భాజపా పాలిత రాష్ట్రాలకు మాత్రం నిధుల మూటలు పంపుతున్న వివక్షపూరిత భాజపా ప్రభుత్వం దిల్లీలో ఉందని కేటీఆర్ ఆరోపించారు.

చరిత్రలో నిలిచిపోతారు.. కిషన్​రెడ్డికి సొంత రాష్ట్రంపై కొంతైనా ప్రేమ ఉంటే తెలంగాణకు ఎన్డీఆర్​ఎఫ్​ ద్వారా అదనపు నిధుల కోసం ప్రయత్నం చేయాలని కేటీఆర్​ సూచించారు. లేదంటే 2018 నుంచి ఇప్పటి వరకు ఒక్క పైసా అదనంగా అందించని తమ కేంద్ర ప్రభుత్వ వివక్ష పూరిత వైఖరి నిజమని ఒప్పుకోవాలని కేటీఆర్ సూచించారు. కేంద్రమంత్రిగా ఉంటూ.. సొంత రాష్ట్రానికి న‌యా పైసా సాయం తీసుకురాని, చేతకాని వ్యక్తిగా కిష‌న్ రెడ్డి చ‌రిత్రలో మిగిలిపోతార‌ని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

ఇవీ చూడండి..

కేసీఆర్‌ మోసాలు ఇక చెల్లవు.. తెలంగాణలో మరింత బలపడతాం.. అధికారం చేపడతాం..

అట్టడుగు స్థాయి నుంచి రాష్ట్రపతి వరకు.. ద్రౌపదీ ముర్ము ప్రస్థానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.