ETV Bharat / state

'అమిత్​ షా తన పేరును అబద్దాల బాద్​షా అని మార్చుకోవాలి' - telangana news

KTR FIRE ON BJP: తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో అమిత్​ షా తుప్పు మాటలు మాట్లాడిపోయారని రాష్ట్ర మంత్రి కేటీఆర్​ విమర్శించారు. అమిత్‌ షా తన పేరును అబద్ధాల బాద్‌షా అని మార్చుకోవాలన్నారు. తెలంగాణకు అక్కరకు వచ్చే ఒక్కమాటను అమిత్‌ షా మాట్లాడలేదన్నారు. ఈ 8 ఏళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలని అడిగామన్న ఆయన.. నిజం చెప్పమని అడిగితే నిజాం గురించి మాట్లాడుతున్నారన్నారు. 8 ఏళ్లుగా కృష్ణా జలాల వివాదాన్ని ఎందుకు పరిష్కరించటం లేదని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఎందుకు ఇవ్వలేదన్నారు.

'అమిత్​ షా తన పేరును అబద్దాల బాద్​షా అని మార్చుకోవాలి'

author img

By

Published : May 15, 2022, 4:57 PM IST

Updated : May 15, 2022, 5:20 PM IST

KTR FIRE ON BJP: అమిత్‌ షా తన పేరును అబద్ధాల బాద్‌షా అని మార్చుకోవాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ విమర్శలు గుప్పించారు. తుక్కుగూడలో జరిగిన బహిరంగ సభలో తెలంగాణకు అక్కరకు వచ్చే ఒక్కమాటను అమిత్‌ షా మాట్లాడలేదని ఆయన అన్నారు. తుక్కుగూడలో తుప్పు మాటలు మాట్లాడి పోయారని కేటీఆర్​ మండిపడ్డారు. భాజపాకు క్షేత్రస్థాయిలో బలం లేదన్న విషయం ఆ పార్టీ నేతలకు తెలుసన్న కేటీఆర్​.. రూ.2500 కోట్లు ఇస్తే సీఎం పదవి అమ్ముకునేందుకు భాజపా సిద్ధపడిందని ఆరోపించారు.

కర్ణాటకలోని విజయపుర ఎమ్మెల్యేను భాజపా డబ్బు అడిగిందని.. డబ్బుల కోసం పదవులు అమ్ముకునే స్థాయి భాజపాది అని విమర్శించారు. భాజపా నేతలు కర్ణాటకలో మఠాధిపతుల నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటారని ఆరోపించారు. కర్ణాటకలో 40శాతం కమీషన్‌ ఇవ్వలేదని గుత్తేదారును వేధిస్తే... అతను ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ 8 ఏళ్లల్లో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలని అడిగామన్న ఆయన.. నిజం చెప్పమని అడిగితే నిజాం గురించి మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి పన్నుల రూపంలో రూ.3,65,797 కోట్లు వెళ్లాయన్న మంత్రి.. కానీ కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది మాత్రం 1.68 లక్షల కోట్లేనని వెల్లడించారు.

"రాజ్యాంగం ప్రకారం రావాల్సిన నిధులు మాత్రమే కేంద్రం ఇస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదు. రాష్ట్రానికి వచ్చిన నిధులపై ఒక్కో భాజపా నేత ఒక్కో విధంగా చెప్పారు తెలంగాణ నిధులు ఇతర రాష్ట్రాల్లో ఖర్చు చేస్తున్నారు. భాజపా అసమర్థ పాలన వల్ల కునారిల్లుతున్న రాష్ట్రాలకు మన నిధులు వెళ్తున్నాయి. మిషన్‌ భగీరథకు రూ.25 వేల కోట్లు ఇచ్చామని పచ్చి అబద్ధం చెప్పారు. మిషన్‌ భగీరథకు రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిఫారసు చేసింది. నీతి ఆయోగ్ చెప్పినా... ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు." -మంత్రి కేటీఆర్​

అప్పుల విషయంలో 28 రాష్ట్రాలున్న జాబితాలో తెలంగాణ 23వ స్థానంలో ఉందని మంత్రి కేటీఆర్​ తెలిపారు. కేంద్రం 60 ఏళ్లల్లో చేసిన అప్పులను మోదీ 8 ఏళ్లల్లో చేశారని ఆయన విమర్శించారు. పెట్రోల్‌, డీజిల్‌పై రూ.26.50 లక్షల కోట్ల పన్నులు వసూలు చేశారని మంత్రి ధ్వజమెత్తారు. భాజపా స్టీరింగ్‌ ఎవరి చేతిలో ఉందో ప్రజలకు తెలుసన్న మంత్రి కేటీఆర్‌.. ఆ స్టీరింగ్‌ రెండు కార్పొరేట్‌ కంపెనీల చేతిలో ఉందని అందరికీ తెలుసన్నారు. ఎవరి కోసం విదేశీ బొగ్గు కొనాలని బలవంతం చేస్తున్నారో తెలుసన్నారు. 8 ఏళ్లుగా కృష్ణా జలాల వివాదాన్ని ఎందుకు పరిష్కరించటం లేదని మంత్రి ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగితే ఎందుకు ఇవ్వలేదన్నారు. కేంద్రం నాన్చకపోతే.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇప్పటికే పూర్తి అయ్యేదని మంత్రి అన్నారు.

మాది ప్యాకప్ నినాదం.. వారిది ప్యాకప్ నినాదం: "తెలంగాణ తన కాళ్ల మీద తాను నిలబడి ఇతర రాష్ట్రాలకు బువ్వ పెడుతోంది. తెలంగాణ పన్నులతో యూపీ, గుజరాత్‌లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న భాజపా ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడుతోంది. మేం స్టార్టప్‌ నినాదంతో వెళ్తుంటే.. భాజపా ప్యాకప్‌ నినాదం వినిపిస్తోంది. కేంద్రంలో 8.50 లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని కేంద్రమంత్రి చెప్పారు. అసమర్థ, దద్దమ్మ, అబద్ధాల ప్రధాని మోదీ. దేశంలో 30 ఏళ్లల్లో ఎప్పుడూ లేని ద్రవ్యోల్బణం ఇప్పుడు ఉంది. ప్రపంచంలోనే గ్యాస్‌ సిలిండర్‌ అధికంగా ఉన్న దేశం భారత్‌. గుజరాత్‌లో పరిశ్రమలకు పవర్‌ హాలిడే ఇచ్చారు. గుజరాత్‌లో మంచినీటి సమస్య పరిష్కరించలేదని భాజపా ఎమ్మెల్యేలు తిడుతున్నారు. డబుల్‌ ఇంజిన్‌ రాష్ట్రాల్లో విద్యుత్‌ లేదు, మంచినీరు లేదు. గుజరాత్‌లో 5 నెలల్లో 4 సార్లు విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. మోదీ సామాన్యుల వద్ద రూ.26.50 లక్షల కోట్లు దోపిడీ చేశారు. మోదీ తన మిత్రులకు మాత్రం వేల కోట్ల రుణాలు మాఫీ చేశారు. మాకు ఓటు వేస్తేనే.. వడ్లు కొంటామని అమిత్ షా మాట్లాడారు." -మంత్రి కేటీఆర్​

అన్ని కేంద్రం నిధులైతే.. భాజపా పాలిత రాష్ట్రాల్లో అభివృద్ధి ఎందుకు లేదని మంత్రి కేటీఆర్​ ప్రశ్నించారు. కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వాలంటున్న భాజపా నేతలు.. పీఎం కిసాన్‌ డబ్బులు కౌలు రైతులకు ఇస్తున్నారా అంటూ ప్రశ్నించారు. కేంద్ర పథకాలను కాపీ కొట్టారంటున్న భాజపా నేతలు.. మిషన్‌ భగీరథ ఎప్పుడు ప్రారంభమైంది, హర్‌ ఘర్‌ జల్‌ ఎప్పుడు ప్రకటించారో చెప్పాలన్నారు. తెలంగాణకు ఏదైనా సంస్థను ప్రకటిస్తారేమోనని ఎదురు చూశానని మంత్రి కేటీఆర్​ అన్నారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఐటీఐఆర్‌ను రద్దు చేసింది ఎవరని ప్రశ్నించారు.

'అమిత్​ షా తన పేరును అబద్దాల బాద్​షా అని మార్చుకోవాలి'

ఇవీ చదవండి:

Last Updated : May 15, 2022, 5:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.