MINISTER KTR ON INDIA DEVELOPMENT చైనా మానవ వనరులను సమృద్ధిగా ఉపయోగించుకుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. నేషనల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ (ఎన్‌హెచ్‌ఆర్‌డీ) జాతీయ సదస్సులో పాల్గొన్న కేటీఆర్... జపాన్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందని వెల్లడించారు. జపాన్ సంబంధించిన వ్యవస్థలపై పెట్టుబడులు సరిగా పెడుతోందని తెలిపారు.
KTR Comments భారత్‌లో ఆర్థిక అభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టి పెడతారని కేటీఆర్ తెలిపారు. ఇతర దేశాల లాగే మన దేశంలో ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెడితే.. నంబర్ వన్‌గా ఎదుగుతామని అన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం 2014లో రూ.1.24 లక్షలు ఉందని.. ప్రస్తుతం తలసరి ఆదాయం రూ.2.78 లక్షలు అయిందని స్పష్టం చేశారు. దేశంలో తలసరి ఆదాయం రూ.1.49 లక్షలు మాత్రమేనని వివరించారు.
''మన దేశం ఆర్థిక వనరులను ఉపయోగించుకుంటే ఇప్పటికే నంబర్ వన్ స్థాయిలో ఉండేది. కానీ ఇక్కడ ఆర్థిక అభివృద్ధి న్నా... రాజకీయాలు, ఎన్నికలపై దృష్టి పెడతారు. అందుకే మన దేశం... చైనా, జపాన్ కంటే వెనుకబడిపోయింది. ఇక తెలంగాణలో ప్రస్తుతం తలసరి ఆదాయం 2 లక్షల 78వేలు. ప్రస్తుత దేశ తలసరి ఆదాయం ఒక లక్ష 49వేలు. అంటే తెలంగాణ తలసరి ఆదాయం కంటే.. దేశ తలసరి ఆదాయం చాలా తక్కువ. ఇది చూస్తే మీకే ఆర్థం అవుతుంది.. దేశం ఎలాంటి నాయకుల చేతుల్లో ఉందో.'' - మంత్రి కేటీ రామారావు
ఇక నేషనల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక అయింది. ఈరోజు నుంచి 4 వరకు మూడు రోజులపాటు నేషనల్ హ్యుమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్(ఎన్‌హెచ్‌ఆర్‌డీ) వార్షిక కాన్ఫరెన్స్ జరుగుతోంది. వెయ్యి మంది డెలిగేట్లు, 100 మంది వక్తలు పాల్గొంటున్న ఈ జాతీయ సదస్సును రాష్ట్ర ఐటీ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు.
ఈ వార్షిక సదస్సుకు దేశవ్యాప్తంగా ఉన్న హెచ్‌ఆర్ నిపుణులు హాజరయ్యారు. 25వ సారి జరుగుతున్న ఈ వార్షిక సమావేశాలు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉన్నదని నిర్వాహకులు తెలిపారు. ఇక హెచ్‌ఆర్‌లో వస్తున్న మార్పులు, టెక్నాలజీ పరంగా తీసుకుంటున్న చర్యలపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.
ఇవీ చూడండి: