ప్రజా ఆరోగ్యం కోసం విపత్తు నిర్వహణ దళం, జీహెచ్ఎంసీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు బాగా పని చేస్తున్నారని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ వ్యాప్తంగా విపత్తు నిర్వహణ దళం ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనం ఉపయోగించి రసాయనాలు చల్లుతున్నారని చెప్పారు. ఈ తరహా వాహనం ఆధునిక సాంకేతికతతో కూడుకున్నదన్నారు.
విశ్వజిత్ కంపాటికి అభినందనలు
విపత్తు నిర్వహణ దళం, జీహెచ్ఎంసీ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు కష్టపడి పనిచేస్తున్నారన్న కేటీఆర్... వీళ్లను పర్యవేక్షిస్తున్న సంచాలకులు విశ్వజిత్ కంపాటిని అభినందించారు. నిర్మాణ రంగంపై ఆధారపడి ఉన్న కూలీలను... పలు నిర్మాణ సంస్థలు ఆదుకోవడం అభినందనీయమని కేటీఆర్ ప్రశంసించారు.
నాలుగు లక్షల మందికి పైగా కార్మికులు
నాలుగు లక్షల మందికి పైగా కార్మికులు హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో పలుచోట్లు ఉన్నారని చెప్పారు. నిర్మాణరంగ సంస్థలు, గుత్తేదారుల సహకారంతో వాళ్లకు కావాల్సిన అవసరాలను తీరుస్తుందని కేటీఆర్ తెలిపారు. కూలీలకు సాయం చేస్తున్న హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లను కేటీఆర్ అభినందించారు.
ఇదీ చూడండి: ఇంట్లో గది లేక చెట్టుపై క్వారెంటైన్ కేంద్రం!