ETV Bharat / state

Ktr on jute mills: ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ: మంత్రి కేటీఆర్

రాష్ట్రంలో గోనె సంచుల కొరత(Ktr on jute mills) అధిగమించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని మంత్రి కేటీఆర్(minister ktr) తెలిపారు. ఈ మేరకు మూడు జిల్లాల్లో జూట్ మిల్లులు ఏర్పాటు చేసేలా మూడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిచ్చారు.

ktr
కేటీఆర్
author img

By

Published : Sep 27, 2021, 2:12 PM IST

రాష్ట్రంలో జనపనార పరిశ్రమల(Ktr on jute mills) ఏర్పాటు ద్వారా ప్రత్యక్షంగా 10,448 మందికి.. పరోక్షంగా రెండింతల మందికి ఉపాధి లభిస్తుందని పట్టణాకభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వరంగల్, రాజన్న సిరిసిల్ల జిల్లా, కామారెడ్డి జిల్లాల్లో జూట్ మిల్లులను నెలకొల్పేలా మూడు ప్రసిద్ధ పారిశ్రామిక సంస్థలతో అవగాహన ఒప్పందం(mou) కుదుర్చుకున్నట్లు చెప్పారు. వరంగల్​లో గ్లోస్టర్ లిమిటెడ్, రాజన్న సిరిసిల్ల జిల్లాలో అగ్రో లిమిటెడ్, కామారెడ్డి జిల్లాలో ఎంబీజీ కమాడిటీస్ లిమిటెడ్ సంస్థలు.. రూ. 887 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు.

గోనె సంచుల తయారీకి కంపెనీలకు(Ktr on jute mills) తెలంగాణ జౌళి, దుస్తుల విధానం కింద ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుంది. యూనిట్లు ఉత్పత్తి చేసిన గోనె సంచులను.. 20 ఏళ్ల పాటు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. మూడో పంటగా జనుము పంట పండించేలా సదరు మూడు కంపెనీలు రైతులతో ఒప్పందం చేసుకునేలా ప్రభుత్వం వీలు కల్పిస్తుంది. ప్రతి పంట సీజన్​లో ఈ మూడు యూనిట్లు 15 కోట్ల గోనె సంచులు ఉత్పత్తి చేస్తాయని అంచనా. ఐదేళ్ల పాటు జూట్‌ మిల్లులకు(Ktr on jute mills) రవాణా రాయితీలు అందజేస్తాం. -కేటీఆర్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి

వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే రాష్ట్రం అగ్రదేశంలో ఉందని కేటీఆర్ అన్నారు. ప్రతి గ్రామంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేశామని చెప్పారు. ఈ నేపథ్యంలో కరోనా సంక్షోభంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో జూట్ పరిశ్రమలు మూతపడ్డాయని.. దీంతో తీవ్రంగా గోనె సంచుల కొరత ఏర్పడిందని పేర్కొన్నారు. ఇక ముందు రైతులకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని ఇక్కడే పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు.

జూట్ ఉత్పత్తులను యూనిట్ల నుంచి మొదటి ఏడేళ్లపాటు 100 శాతం, తరువాత ఐదేళ్లపాటు 75శాతం, ఎనిమిదేళ్లపాటు 50 శాతం ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేటీఆర్ అన్నారు. ఈ క్రమంలో ఐదేళ్లలోపు రాష్ట్రంలో జనుము పంటను పండించేలా రైతులను ప్రోత్సహిస్తామని చెప్పారు. తద్వారా స్వయం సమృద్ధితో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: Minister Srinivas Goud: 'బార్ అండ్ రెస్టారెంట్ల‌లోనూ రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.