హైదరాబాద్ ప్రపంచంలోనే సురక్షితమైన నగరమని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. 'బ్రాండ్ హైదరాబాద్' కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భౌగోళికంగా హైదరాబాద్ అత్యంత సురక్షితమైన నగరమని కేటీఆర్ తెలిపారు. భాగ్యనగరం గొప్పతనం తెలియాలంటే... దేశంలోని అన్ని సిటీలలో తిరగాలన్నారు.
''ఒక్కరోజులో, ఒక్క ప్రభుత్వంతో హైదరాబాద్‌కు బ్రాండ్ ఇమేజ్ రాలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉంది. అందుకే పెట్టుబడులు వుస్తున్నాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను కాపాడుతూ వృద్ధిని కొనసాగించాం. ఐటీ రంగంలో బెంగళూరు కంటే ఎక్కడ వెనుకబడ్డామో పరిశీలించుకుంటున్నాం. గత ఐదేళ్లలో ఐటీ పెట్టుబడులు రెట్టింపయ్యాయి. ఐటీ అభివృద్ధికి మానవ వనరులు, ప్రభుత్వ విధానాలు, లాజిస్టిక్స్ అవసరం.''
-మంత్రి కేటీఆర్
ఐదు ప్రపంచ ప్రఖ్యాత ఐటీ కంపెనీలు హైదరాబాద్‌ను తమ రెండో చిరునామాగా ప్రకటించాయని మంత్రి వెల్లడించారు. వివిధ కంపెనీలు ప్రకటించిన పెట్టుబడుల్లో 40 శాతం కార్యరూపం దాల్చాయని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ప్రశాంతతతోనే ఆర్థికాభివృద్ధి... తెరాసతోనే అది సాధ్యం'