శాంతికి భంగం కలిగించే శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండి, అటువంటి ప్రయత్నాలను ఎండగట్టాలని మంత్రి కొప్పులు ఈశ్వర్ పేర్కొన్నారు. నగరంలో క్రైస్తవ మత ప్రముఖులతో సమావేశమైన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్కు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని మత పెద్దలు ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. మత మౌఢ్యంతో దుందుడుకుగా వ్యవహరిస్తున్న భాజపాని జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడించాలని సూచించారు. రాష్ట్రంలో శాంతి నెలకొంటేనే సుస్థిరాభివృద్ధి సాధ్యమౌతుందని పేర్కొన్నారు. ఈ ఆరున్నరేళ్లలో తెలంగాణ, హైదరాబాద్ నగరం గణనీయంగా అభివృద్ధి చెందిందని మంత్రి వివరించారు.
క్రైస్తవుల అభివృద్ధికి
నగరంలో చర్చి నిర్మాణానికి సీఎం కేసీఆర్.. రెండెకరాల భూమితో పాటు రూ. 2 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. అలాగే శ్మశాన వాటికల కోసం 62 ఎకరాలను సేకరించామని పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఈ ఏడాది కూడా రెండున్నర లక్షల మంది పేదలకు దుస్తుల పంపిణీ చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: నమూనా క్షిపణి మిస్ ఫైర్.. భయాందోళనకు గురైన స్థానికులు..