ETV Bharat / state

'ఇస్లాం.. శాంతి, ప్రేమ, దయాగుణాలకు ప్రతీక' - Koppula Ishwar, the minister who wished Ramjan

ఇస్లాం... శాంతి, ప్రేమ, దయాగుణాలను ప్రబోధిస్తుందని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Koppula Ishwar wished Ramjan
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొప్పుల ఈశ్వర్‌
author img

By

Published : Apr 13, 2021, 5:57 PM IST

మత సామరస్యానికి, సౌభ్రాతృత్వానికి మన రాష్ట్రం పెట్టింది పేరని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని మతాలు, కులాలకు సమానమైన సంక్షేమ పథకాలను అందిస్తున్నారని కొనియాడారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు

తెరాస పాలనలో మైనారిటీలతో పాటు ప్రజలంతా సుఖశాంతులతో జీవిస్తున్నారని కొప్పుల తెలిపారు. మైనారిటీల అభ్యున్నతి కోసం ఈ ఏడాది బడ్జెట్లో రూ. 1606 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు. షాదీముబారక్‌ పథకాన్ని అమలు చేస్తుండటంతో బాల్య వివాహాలు పూర్తిగా తగ్గాయన్నారు.

జామే నిజామియాలో రూ. 15కోట్లతో అత్యాధునిక ఆడిటోరియాన్ని నిర్మిస్తున్నట్లు కొప్పుల ఈశ్వర్‌ తెలిపారు. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు చీరలు, దుస్తులు ప్రతి ఏటా అందిస్తున్నామని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి కారణంగా సామూహిక విందులు ఏర్పాటు చేయలేకపోతున్నామని మంత్రి పేర్కొన్నారు. ముస్లిం సమాజం ఆచరించే పవిత్ర ఉపవాస దీక్షలతో కొవిడ్​ పీడ విరుగడ కావాలని మంత్రి ఈశ్వర్ ఆకాంక్షించారు.

ఇదీ చదవండి: ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.