ETV Bharat / state

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్​ లక్ష్యం: కొప్పుల - హైదరాబాద్​ తాజా వార్తలు

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 440 సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. ప్రభుత్వం... ఎస్సీ సముద్ధరణకు కేటాయించిన నిధుల వినియోగంపై మంత్రి కొప్పుల అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్​ లక్ష్యం: కొప్పుల

author img

By

Published : Feb 13, 2021, 8:09 PM IST

అంబేడ్కర్​ స్ఫూర్తితో అన్ని వర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్​ కృషి చేస్తున్నారని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ అన్నారు. ముఖ్యమంత్రి తాజాగా ఎస్సీ సముద్ధరణకు అదనంగా కేటాయించిన రూ.1,000 కోట్లతో ఎలాంటి కార్యక్రమాలు చేపడితే మరింత మేలు జరుగుతుందనే అంశంపై మంత్రులు విస్తృతంగా చర్చించారు. నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్​లోని మంత్రుల నివాస ప్రాంగణంలో మంత్రి కొప్పుల ఈశ్వర్​ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు.

ఈ భేటీలో ప్రభుత్వ విప్‌లు బాల్క సుమన్, గువ్వల బాలరాజు, ఎంఎస్ ప్రభాకర్, మాజీ ఉప ముఖ్యమంత్రులు డాక్టర్ టి.రాజయ్య, కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఇక్కడ చర్చించిన అంశాలను, ప్రతిపాదనలను క్రోడీకరించి తర్వలో ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపారు.

ఇదీ చూడండి: సభ్యత్వ నమోదులోనూ సిద్దిపేట ముందుండాలి: హరీశ్​రావు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.