ETV Bharat / state

రామాంతపూర్​లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్​రెడ్డి - మేయర్​ బొంతు రామ్మోహన్​ వార్తలు

హైదరాబాద్​ రామాంతపూర్​లోని పెద్ద, చిన్న చెరువులతో పాటు నీట మునిగిన కాలనీలను మంత్రి కిషన్​రెడ్డి, మేయర్​ బొంతు రామ్మోహన్​రావు పరిశీలించారు. మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించినట్లు మంత్రి తెలిపారు.

minister kishanreddy and mayor bonthu rammohan visited at ramanthapur
రామాంతపూర్​లో వర్షం నష్టాన్ని పరిశీలించిన కిషన్​రెడ్డి
author img

By

Published : Oct 15, 2020, 10:06 PM IST

తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకునేందుకు కేంద్రం తరపున చర్యలు చేపట్టామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్​లోని రామాంతపూర్​లో పెద్ద, చిన్న చెరువులతో పాటు నీట మునిగిన కాలనీలను ఆయన పరిశీలించారు. మంత్రితో పాటు మేయర్​ బొంతు రామ్మోహన్​రావు, ఎమ్మెల్యే బేతి సుభాష్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్​, తదితర ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.

మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకుండా వర్షాకాలంలో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాలను సూచించినట్లు మంత్రి వివరించారు. తెలిసీ తెలీక నాలా పక్కన గృహాలు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలాంటి పరిస్థితి నెలకొందని మేయర్​ రామ్మోహన్​ అన్నారు. బాధితులను అన్ని విధాల ఆదుకుంటామని.. రామాంతపూర్​ చిన్న, పెద్ద చెరువులకు శాశ్వత పరిష్కారానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు.

ఇవీ చూడండి: వరదల్లో ఒకే కుటుంబానికి చెందిన 8మంది గల్లంతు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.