Minister Jagadish reddy on electricity
జాతీయ తలసరి విద్యుత్ వినియోగం కంటే.. రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం 73 శాతం అధికంగా ఉందని.. ఆ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి, కోరుకంటి చందర్, సండ్ర వెంకట వీరయ్య.. అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డాక.. గతం కంటే తొమ్మిదిన్నర వేల మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి పెంచుకున్నామని.. మంత్రి వెల్లడించారు.
'' రాష్ట్రం ఏర్పాటైన తర్వాత విద్యుత్ రంగాన్ని పటిష్టం చేసేందుకు వివిధ రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. విద్యుత్ రంగంలో రాష్ట్రం అనేక విజయాలు సాధించింది. జాతీయ తలసరి వినియోగం 1,161 యూనిట్లుగా ఉంది. మన తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లుగా ఉంది.. జాతీయ తలసరి వినియోగంతో పోల్చితే మన తలసరి విద్యుత్ ఎక్కువగా ఉంది. విద్యుత్ రంగాన్ని సీఎం కేసీఆర్ చక్కదిద్దారు. మొదటి ఆరు నెలల్లోనే అద్భుతమైన విజయం సాధించాం. అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నాం.''
- మంత్రి జగదీశ్‌రెడ్డి
2014లో 7,778 మెగావాట్లు ఉంటే నేడు 17,503 మెగావాట్లకు చేరుకుందని మంత్రి జగదీశ్‌రెడ్డి స్పష్టం చేశారు. సోలార్ విద్యుత్ రంగంలో 74 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ఉంటే.. ఇవాళ 4,430 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని తెలిపారు. తెలంగాణ ఏర్పడే నాటికి 5,661 మెగవాట్ల పీక్ డిమాండ్ ఉంటే.. ఇప్పుడు 13,688 మెగావాట్ల పీక్ డిమాండ్ ఉందన్నారు.
'' జాతీయ తలసరి విద్యుత్ వినియోగం కంటే రాష్ట్రానిదే ఎక్కువ. 73 శాతం అధికంగా రాష్ట్ర తలసరి విద్యుత్ వినియోగం. రాష్ట్రం ఏర్పడ్డాక తొమ్మిదిన్నర వేల మెగావాట్ల ఉత్పత్తి పెరిగింది. పీక్ డిమాండ్‌ను సైతం తట్టుకుని ముందుకు వెళ్తున్నాం.''
- మంత్రి జగదీశ్‌రెడ్డి
ఇదీ చదవండి: Special Grants to Telangana : కేంద్రంపై తెలంగాణ ఆశ.. నిధులు అందక నిరాశ