Minister Jagadish Reddy: హైదరాబాద్ నగరంలో రాబోయే 30, 40సంవత్సరాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. రాయదుర్గంలో దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్మిస్తున్న గ్యాస్ ఇన్స్‌లేటెడ్ 400కేవీ సబ్‌స్టేషన్‌ను మంత్రి సందర్శించి పనులను పరిశీలించారు. రూ.1400కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న గ్యాస్ ఇన్స్‌లేటెడ్ సబ్‌స్టేషన్‌ను త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభిస్తారని మంత్రి ప్రకటించారు.
ఈ సబ్ స్టేషన్‌తో నగరానికి మరో 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేయవచ్చునని మంత్రి వివరించారు. దేశంలో మొదటిసారి మోనో పోల్స్ కూడా మనమే వాడుతున్నామని...టీఎస్ ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిందని.. పనులు కూడా చాలా వేగంగా జరిగాయన్నారు. కొవిడ్‌తో పాటు అనేక ఆటంకాలు తట్టుకుని పనులు పూర్తి చేసినట్లు మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
గ్యాస్ ఇన్స్‌లేటెడ్ సబ్‌స్టేషన్..
సబ్స్టేషన్ల నిర్మాణం ఒకే ప్రాంతంలో చేయడమనేది దీని ప్రత్యేకత. ఇది గ్యాస్ ఇన్స్‌లేటెడ్ సబ్‌స్టేషన్. ఈ నాలుగు సబ్స్టేషన్లు రావాలంటే దాదాపు 100 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. కానీ నగర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని 5 ఎకరాల్లోనే సబ్స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నాం. -జగదీశ్ రెడ్డి, రాష్ట్ర మంత్రి
ఇదీ చదవండి: