పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని అరణ్య భవన్లో.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్పై రూపొందించిన పాటను వనజీవి రామయ్యతో కలిసి ఆవిష్కరించారు.
ఈ పాటను దేశపతి శ్రీనివాస్ రచించగా.. గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ ఆలపించారు. లోక్ సభ సభ్యుడు సంతోష్ కుమార్ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి కొనియాడారు. హరిత తెలంగాణగా మార్చాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 4 శాతం పచ్చదనం పెరిగిందని తెలిపారు.
ఇదీ చూడండి: క్రైస్తవులకు గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు