రాష్ట్రవ్యాప్తంగా ఏడో విడత హరితహారం కార్యక్రమం జులై 1 నుంచి 10 రోజుల పాటు కొనసాగుతుందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా అంబర్‌పేట కలాన్‌లోని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న రిజర్వ్ అటవీ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్‌తో కలిసి లాంఛనంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు. హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన అంబర్‌పేట కలాన్ అర్బన్ ఫారెస్ట్ పార్కును ప్రారంభిస్తామన్నారు.
హరితహారంలో 230 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా... ఈ విడతలో 20 కోట్ల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. ఆరు విడతల హరితహారం విజయవంతమైన స్ఫూర్తితో అందరూ భాగస్వాములై మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా ఈ విడతలో ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. రహదారి వనాలకు ప్రాధాన్యత ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ఫోన్ గురించి గొడవ- చెల్లిని నరికి చంపిన అన్న