కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఎయిడ్స్, హెపటైటిస్ రోగులకు ఉచిత డయాలసిస్ సేవలు అందించాలని (free dialysis centers in Telangana )సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్, వరంగల్లో ప్రత్యేకంగా రెండు డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(minister harish rao) అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ ట్రస్ట్ కేర్ ఆసుపత్రిలో వైద్య ఆరోగ్య శాఖ ఉన్నత అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
సమావేశంలో వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ ప్రీతీ మీనా, ఓఎస్డీ డాక్టర్ గంగాధర్, టీఎస్ఎంఎస్ఐడీసీ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి , ఐపీఎం డైరెక్టర్ శంకర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. హైదరాబాద్, వరంగల్లో ఏర్పాటు చేయనున్న కేంద్రాల్లో ఎయిడ్స్ రోగలకు ఐదు, హెపటైటిస్ రోగుల కోసం మరో ఐదు పడకలు ప్రత్యేకంగా కేటాయించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆధీనంలో ఇప్పటికే 43 డయాలిసిస్ కేంద్రాలు నడుస్తుండగా.. వాటిలో నెలకు సుమారు 10 వేల మంది రోగులకు డయాలసిస్ సేవలు అందుతున్నాయని అధికారులు వివరించారు.
ఇదీ చూడండి: