Harish rao comments: నీటి కేటాయింపుల్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తెలంగాణ భవిష్యత్తు దృష్ట్యా ప్రాజెక్టుల రీడిజైనింగ్‌కు కేసీఆర్ రూపకల్పన చేశారని స్పష్టం చేశారు. అసెంబ్లీలో సాగునీటి రంగం పద్దుపై సమాధానమిచ్చిన హరీశ్ రావు... పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు.
ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందన్న కాంగ్రెస్ ఆరోపణలను ఖండించారు. మహారాష్ట్రతో అంతరాష్ట్ర జల ఒప్పందం చేసుకుని కాళేశ్వరంను త్వరితగతిన పూర్తి చేశామని హరీశ్ రావు స్పష్టం చేశారు. అందులో భాగంగానే రిజర్వాయర్ల సామర్థ్యం పెంచినట్లు వివరించారు. ప్రాజెక్టులు పూర్తి కాకుండా కాంగ్రెస్ నేతలు న్యాయస్థానాల్లో కోర్టు వేశారని ఆరోపించారు. 10 జిల్లాల వర ప్రదాయని మల్లన్న సాగర్ ప్రాజెక్టు అని స్పష్టం చేశారు.
హైదరాబాద్ చూట్టూ నీరు ఉంటేనే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రజల సంక్షేమమే... కేసీఆర్ అంతిమలక్ష్యమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవగాహనా రాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ''మీరు చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా?'' అని కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి మాట్లాడారు. గత ప్రభుత్వం సర్వే పేరు మీద రూ.1,559 కోట్లు దోచుకుందని ఆరోపించారు.
ప్రాజెక్టులపై కేసులు వేసినా పూర్తి చేస్తాం. రిజర్వాయర్లకు సామర్థ్యం పెంచారు. నీటి కేటాయింపులు చేయాల్సిన పరిస్థితి మన దేశంలో ఉంది. 10 జిల్లాల వర ప్రదాయని మల్లన్న సాగర్ ప్రాజెక్టు. కాంగ్రెస్ పార్టీ నేతలు అవగాహనా రాహిత్యంగా మాట్లాడుతున్నారు. మీరు చేసిన తప్పులను సరిదిద్దడం తప్పా? గత ప్రభుత్వం సర్వే పేరు మీద రూ.1,559 కోట్లు దోచుకుంది.
- మంత్రి హరీశ్‌రావు
ఇదీ చదవండి: రాజగోపాల్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలతో అసెంబ్లీలో రగడ