ETV Bharat / state

'బడ్జెట్‌లో సింహభాగం సాగునీటి పారుదల రంగానిదే..' - తెలంగాణ సాగునీటి పారుదల రంగం

2020-20 ఆర్థిక సంవత్సరానికి మంత్రి హరీశ్​రావు.. అసెంబ్లీలో బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఈసారి వార్షిక పద్దులో సాగునీటి పారుదల రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది.

minister-harish-rao-talk-about-irrigation-sector-in-assembly
'బడ్జెట్‌లో సింహభాగం సాగునీటి పారుదల రంగానిదే..'
author img

By

Published : Mar 8, 2020, 1:20 PM IST

Updated : Mar 8, 2020, 3:47 PM IST

''నా తెలంగాణ కోటి రతనాల వీణ అని దాశరథి నినదించారు... నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం కావాలన్నదే కేసీఆర్ స్వప్నం'' అని అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​రావు అన్నారు. సాగునీటి పారుదల రంగానికి 11,054 రూపాయలను కేటాయించినట్లు తెలిపారు. గోదావరి, కృష్ణా జలాలను సమగ్రంగా వినియోగించుకునేందుకు కేసీఆర్ ప్రాజెక్టులను రీడిజైన్ చేశారని పేర్కొన్నారు. బడ్జెట్‌లో సింహభాగం నిధులు నీటిపారుదల రంగానికి కేటాయించినట్లు తెలిపారు.

మూడేళ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి కేసీఆర్ జాతికి అంకితం చేశారని చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం ప్రఖ్యాతి గాంచిందని తెలిపారు. కాళేశ్వరం స్ఫూర్తితో పాలమూరు-రంగారెడ్డి, సీతారామ వంటి ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు. సమైక్య రాష్ట్రంలో తుమ్మలు మొలిచిన ఎస్సారెస్పీ కాల్వలో నేడు నిండుగా ప్రవహిస్తూ కళకళలాడుతున్నాయని చెప్పారు. మధ్యమానేరు 24 టీఎంసీల నీటితో నిండు కుండలా మారిందన్నారు. త్వరలోనే రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు.

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని వివరించారు. 1,000 చెరువుల్లో నీటిని నింపి వలసలు నివారించామని అసెంబ్లీలో తెలిపారు.

Last Updated : Mar 8, 2020, 3:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.