హుందాయి సంస్థ (Hyundai company) రాష్ట్ర ప్రభుత్వానికి అందించిన ఏడు అంబులెన్స్‌లను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(harish rao) ప్రారంభించారు. హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
![Minister harish rao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13670201_191_13670201_1637237550768.png)
హైదరాబాద్‌లో కొత్తగా మరో 4 ఆస్పత్రులు నిర్మిస్తున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు(harish rao) తెలిపారు. సీఎస్ఆర్ పథకం కింద హుందాయి సంస్థ (Hyundai company) అందజేసిన ఏడు అంబులెన్సులను హైదరాబాద్ కోఠిలోని డీఎంఈ కార్యాలయంలో ప్రారంభించారు. కొత్త ఆస్పత్రులకు త్వరలో సీఎం శంకుస్థాపన చేస్తారని హరీశ్ రావు వెల్లడించారు.
ఈ అంబులెన్స్‌లను బోధనాస్పత్రులకు అందజేస్తున్నట్లు మంత్రి హరీశ్ రావు (harish rao) తెలిపారు. రూ.1.41 కోట్ల విలువైన అంబులెన్సులు అందించినట్లు మంత్రి తెలిపారు. వీటిలో నాలుగింటిలో లైప్ సపోర్ట్ సదుపాయం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 429 అంబులెన్స్‌లు ఉన్నట్లు వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్ సేవల పునరుద్ధరణకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో 108 అంబులెన్సుల సేవలను మరింత మెరుగ్గా నిర్వహిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న పాత అంబులెన్సుల స్థానంలో కొత్తవాటిని పునరుద్ధరిస్తామని తెలిపారు. అవసరమైన చోట కొత్తవాటిని అందుబాటులోకి తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హుందాయి కంపెనీ ప్రతినిధులు, డీఎంఈ రమేష్ రెడ్డి, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వాకటి కరుణ, వైద్యాధికారులు పాల్గొన్నారు.
నగరంలో నలు మూలల నాలుగు పెద్ద ప్రభుత్వ ఆస్పత్రులు ఉండాలి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ప్రజలకు అందుబాటులో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందించాలి. ఉత్తర తెలంగాణలో వరంగల్‌లో కార్పొరేట్ స్థాయిలో ఒక పెద్ద ఆస్పత్రి నిర్మించేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ ఇప్పటికే అంకురార్పణ చేశారు. అందుబాటులో అన్ని వైద్య సదుపాయాలు కల్పించడమే సీఎం ఉద్దేశం. త్వరలోనే వాటికి డిజైన్ ఫైనల్ చేస్తాం. ముఖ్యమంత్రి ఆశయాలతో మా పనులు మరింత వేగవంతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం.
- హరీశ్ రావు, వైద్యారోగ్య శాఖ మంత్రి
ఇదీ చూడండి: