ETV Bharat / state

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్: హరీశ్‌రావు - మంత్రి హరీశ్​రావు వార్తలు

Telangana Budget 2023-24: రాష్ట్ర బడ్జెట్​ తెలంగాణ ప్రజల ఆకాంత్రలకు అనుగుణంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీకి బయల్దేరే ముందు జూబ్లీహిల్స్​లో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సంక్షేమానికి అభివృద్ధికి బడ్జెట్​లో సమ ప్రాధాన్యాత ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.

Telangana Budget
Telangana Budget
author img

By

Published : Feb 6, 2023, 10:41 AM IST

Telangana Budget 2023-24: రాష్ట్రంలో తొలిసారిగా రూ.2,90,396 కోట్లతో బడ్జెట్ రూపొందించారు. ఎన్నికల సంవత్సరంలో ప్రవేశపెడుతున్న కీలక బడ్జెట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం భారీ కసరత్తు చేసింది. రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. శాసనమండలిలో మంత్రి ప్రశాంత్​రెడ్డి బడ్జెట్​ను ప్రవేశపెట్టారు.

అంతకుముందు మంత్రి హరీశ్​రావు బడ్జెట్​ దస్త్రాలతో ఇంటి నుంచి బయల్దేరారు. రాష్ట్ర బడ్జెట్​ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని మంత్రి తెలిపారు. అసెంబ్లీకి బయల్దేరే ముందు జూబ్లీహిల్స్​లో శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని మంత్రి దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

సంక్షేమానికి అభివృద్ధికి బడ్జెట్​లో సమ ప్రాధాన్యాత ఉంటుందని ఆయన చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బడ్జెట్​ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది చివర్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే కానుంది. దీంతో ఏయే రంగాలకు ఎంత కేటాయింపులు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.