ETV Bharat / state

నాటిన ప్రతి మెుక్కను కాపాడాలి : మంత్రి హరీశ్​ - sixth phase of Haritha Haram june 20th

ఆరో విడత హరితహారంపై మంత్రి హరీశ్​రావు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని సూచించారు. నాటిన ప్రతి మెుక్కను కాపాడాలని ఆయన సూచించారు.

Minister Harish rao said every tree lacquer planted should be protected
నాటిన ప్రతి మెుక్కను కాపాడాలి : మంత్రి హరీశ్​
author img

By

Published : Jun 15, 2020, 9:21 PM IST

హరితహారం కార్యక్రమంలో నాటిన ప్రతి మొక్కను బ్రతికించాల్సిన బాధ్యత అధికారులు, ప్రజాప్రతినిధులపై ఉందని మంత్రి హరీశ్​రావు అన్నారు. హైదరాబాద్​లో ఆయన నివాసంలో అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వం ఇప్పటికే ఐదు విడతలుగా హరితహారం విజయవంతంగా నిర్వహించిందన్నారు. ఈనెల 20న ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సన్నద్దం కావాలని సూచించారు.

ఈ విడతలో చేపడుతున్న హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. పెద్ద సంఖ్యలో ఏడాది కన్నా పెద్దగా ఉన్న మొక్కలను నాటి, వాటిని సంరక్షించాలన్నారు. నర్సరీల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని, నాటేందుకు వీలుగా నర్సరీల్లో మొక్కలు ఎదుగుదలతో ఉండాలని వివరించారు. మొక్కలు నాటేందుకు వీలుగా గుంతలు తవ్వడం, ట్రీ గార్డులు ఇప్పటి నుంచే ఏర్పాటు చేసుకోవాలని మంత్రి సూచించారు.

నాటిన ప్రతి మెుక్కను కాపాడాలి : మంత్రి హరీశ్​

ఇదీ చూడండి : వారం, పదిరోజుల్లో బ్యాంకుల్లో రైతుబంధు సొమ్ము: కేసీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.