ETV Bharat / state

Minister harish rao: కేంద్రం కొవిడ్​ వ్యాక్సిన్​ను త్వరగా పంపిణీ చేయాలి - telangana varthalu

ప్రజలకు వేగంగా వ్యాక్సిన్​ను అందించాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్​రావు కేంద్రాన్ని కోరారు. కొవిడ్ మూడో విడత‌ ఉద్ధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. జీఎస్టీ మండలి 44వ సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు.

minister harish rao
కేంద్రం కొవిడ్​ వ్యాక్సిన్​ను త్వరగా పంపిణీ చేయాలి
author img

By

Published : Jun 12, 2021, 3:52 PM IST

దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని కేంద్రాన్ని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కోరారు. జీఎస్టీ మండలి 44వ సమావేశంలో హరీశ్ రావు మాట్లాడారు. కొవిడ్ టీకా ఉత్పత్తి దేశీయంగా సరిపడా లేనందున.. విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు. కొవిడ్ మూడో విడత‌ ఉద్ధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. కరోనా చికిత్సకు అవసరమైన ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర ఔషధాలు, వైద్యసామాగ్రిపై పన్నులకు సంబంధించి... మేఘాలయ సీఎం సంగ్మా నేతృత్వంలోని మంత్రుల బృందం సిఫారసులకు హరీశ్ రావు మద్దతు తెలిపారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్ సాగుతోందని.. దీంతో ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని మంత్రి చెప్పారు. మే నెలలో 4వేల100‌కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని... లాక్‌డౌన్ ఇంకా ఎన్నిరోజులు ఉంటుందో చెప్పలేమని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల ఎఫ్​ఆర్​బీఎం పరిమితిని 4 నుంచి 5శాతానికి పెంచాలని హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రుణపరిమితి పెంపుతో దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని తద్వారా ఉద్యోగాలు కూడా పెరుగుతాయని అన్నారు.

ఇదీ చదవండి: వ్యాక్సినేషన్​లో రికార్డు​.. ఒక్క రోజులో 2 లక్షలకు పైగా టీకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.