ETV Bharat / state

Harishrao on Omicron: 'ఒమిక్రాన్ వస్తే తట్టుకోలేం.. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలి' - Harish rao on corona third wave

Harish rao on Omicron: రాష్ట్రంలో ఒమిక్రాన్‌ సన్నద్ధతపై రేపు మరోసారి సమీక్షిస్తామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నిలోఫర్‌లో 2 కోట్లతో ఏర్పాటు చేసిన సీటీ స్కాన్‌ యంత్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఒమిక్రాన్ వస్తే తట్టుకోలేమని.. అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు.

Harish rao on Omicron: 'ఒమిక్రాన్ వస్తే తట్టుకోలేం.. అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి'

author img

By

Published : Dec 13, 2021, 7:49 PM IST

Harish rao on Omicron: బ్రిటన్​లో ఒమిక్రాన్ వేరియంట్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతోందని.. దీంతో రాష్ట్రంలో కూడా అలర్ట్​గా ఉన్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. మూడో దశ కరోనా ఏర్పాట్లపై రేపు వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నట్లు వెల్లడించారు. నిలోఫర్ ఆస్పత్రిలో 2కోట్లతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్​ యంత్రాన్ని మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్​ యాదవ్​ కూడా పాల్గొన్నారు. విదేశీయులకు 15 మందికి ఒమిక్రాన్ పరీక్షలు చేయగా అందరికి నెగెటివ్ వచ్చిందని మంత్రి తెలిపారు. డాక్టర్ల పని విధానంపై ప్రతి నెల అస్సెస్​మెంట్​ చేయాలని అధికారులను ఆదేశించారు.

అందరూ వ్యాక్సిన్​ తీసుకోవాలి..

minister harish rao on omicron: ఆరోగ్యశ్రీలో ప్రతి కుటుంబానికి ఇప్పుడు 5 లక్షల వరకు సేవలను వైద్యులు అందిస్తున్నారని అన్నారు. ప్రొఫెసర్లు, సీనియర్ వైద్యులు ఓపీలో పనిచేయాలని, సర్జరీలు చేయాలని సూచించామన్నారు. మాత శిశు మరణాల సంఖ్యలో తల్లుల మరణాల శాతం 92 నుంచి 69కి తగ్గిందని.. శిశు మరణాలు కూడా తగ్గాయన్నారు. ఒమిక్రాన్ వస్తే తట్టుకోలేమని.. అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలని పేర్కొన్నారు.

మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధం..

రేపు ఉస్మానియాలో క్యాథ్ లాబ్ సేవలు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​ రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఒమిక్రాన్ కేసు లేదన్నారు. మూడో వేవ్ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మంత్రి అన్నారు. టెస్టింగ్‌ కిట్లు, ఔషధాలు, పడకలు పెంచుతామన్న మంత్రి.. టీ డయాగ్నోస్టిక్ట్ కేంద్రాల సేవలు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. మిగతా 13 జిల్లాల్లోనూ టీ డయాగ్నోస్టిక్ కేంద్రాలు ప్రారంభిస్తామని మంత్రి హరీశ్​ రావు వెల్లడించారు.

ఒక్క కేసు రాలేదు..

రాష్ట్రంలో తలసరి రూ.1698 తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్య రంగంపై తెలంగాణ ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. వెల్నెస్​ యాక్టివిటీస్​లో తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్​.1గా కేంద్రం ప్రకటించింది. ఆయుష్మాన్​ భారత్​లో యాడ్​ చేసిన తర్వాత 642 రకాల చికిత్సలకు వైద్య రంగంలో కొత్త కేసులు చేయడానికి అవకాశం వచ్చింది. కేవలం రెండు,మూడు రోజుల్లోనే ఒమిక్రాన్​ కేసులు డబుల్​ అవుతాయని అంటున్నారు. దాని వ్యాప్తి అనేది చాలా ఎక్కువగా ఉంది. దేవుడి దయ వల్ల తెలంగాణకు ఇంతవరకు ఒక్క కేసు కూడా రాలేదు. అన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నాం. రేపు ఒమిక్రాన్​పై, థర్డ్​వేవ్​పై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి.. ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చిస్తాం. టెస్టింగ్‌ కిట్లు, ఔషధాలు, పడకలు పెంచుతాం. -మంత్రి హరీశ్​ రావు, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి

Harish rao on Omicron: 'ఒమిక్రాన్ వస్తే తట్టుకోలేం.. అందరూ విధిగా వ్యాక్సిన్ తీసుకోవాలి'

ఇదీ చదవండి:

Harish rao on Health: హెల్త్​ ఛాంపియన్​గా తెలంగాణ అవతరించింది: హరీశ్​ రావు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.