Minister Harish Rao Inaugurate MCH Block at Gandhi Hospital : ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మాతా శిశు మరణాలు చాలా వరకు తగ్గించామని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గాంధీ ఆసుపత్రిలో రూ.52 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, డైట్ కిచెన్, నియో నాటల్ కోసం 33 అంబులెన్స్‌లు ప్రారంభించుకున్నామని తెలిపారు. తల్లి మరణాలను 93 శాతం ఉంటే.. ఇప్పుడు 42 శాతానికి తగ్గించామని పేర్కొన్నారు. చిన్నారుల మరణాలను కూడా అరికట్టగలిగామని చెప్పారు. 3 ఎంసీహెచ్ ఆసుపత్రులు నిర్మించాలని అనుకున్నామని వివరించారు. ఒకటి గాంధీ ఆసుపత్రిలో నిర్మాణం పూర్తైందన్నారు.
Harish Rao Inaugurate Mother and Child Hospital : నిమ్స్ హాస్పిటల్లో నిర్మాణ పనుల్లో ఉందని.. అల్వాల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో భాగంగా ఎంసీహెచ్ ఆసుపత్రి నిర్మాణంలో ఉందని తెలిపారు. పెద్ద హాస్పిటల్స్ ఎంసీహెచ్ (MCH) ఆసుపత్రులను అటాచ్ చేసి కట్టడానికి ముఖ్య కారణం.. మల్టిపుల్ ఆర్గాన్స్ ఇబ్బందులు తలెత్తిన సమయంలో మెరుగైన వైద్యం అందించడానికి ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో తల్లుల ఆరోగ్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో దాని అరికట్టేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంసీహెచ్ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నామన్నారు. చిన్నారుల మరణాలను అరికట్టడానికి అన్ని జిల్లాలకు ఒక్కో నియో నాటల్ అంబులెన్స్‌లను ప్రారంభించామని అన్నారు.
Harish Rao Review: దిల్లీ ఎయిమ్స్ తరహాలో టిమ్స్ సేవలు ఉండాలి: హరీశ్‌రావు
"గాంధీ ఆసుపత్రిలో రూ.52 కోట్లతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, డైట్ కిచెన్, నియో నాటల్ కోసం 33 అంబులెన్స్‌లు ప్రారంభించుకున్నాం. మాతా శిశు మరణాలు ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా వరకు తగ్గించాం. తల్లి మరణాలను 93 శాతం ఉంటే.. ఇప్పుడు 42 శాతానికి తగ్గించాం. చిన్నారుల మరణాలను కూడా అరికట్టగలిగాం. 3 ఎంసీహెచ్ ఆసుపత్రులు నిర్మించాలని అనుకున్నాం. ప్రైవేట్ హాస్పిటల్లో తల్లుల ఆరోగ్యం కోసం రూ.లక్షలు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో దానిని అరికట్టేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎంసీహెచ్ ఆసుపత్రుల నిర్మాణం చేపడుతున్నాం." -హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ మంత్రి
ఈ అంబులెన్స్‌లో శిశు మరణాలు సంభవించకుండా.. ప్రతి ఒక్క అత్యాధునిక సౌకర్యంతో మెరుగైన వైద్యo అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో డెలవరీల సంఖ్య 72 శాతానికి పెంచుకున్నామని.. దానికి కారణం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలే కారణమని కొనియాడారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంటేషన్ నిమ్స్, ఉస్మానియాతో పాటు గాంధీ ఆసుపత్రిలో కూడా చేస్తున్నామని తెలిపారు. గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి నుంచి లివర్‌ను ఉస్మానియాలో రి ప్లేస్ చేయబోతున్నామని చెప్పారు. అలాగే మోడ్రన్ కిచెన్ ప్రారంభించుకున్నామన్నారు. డైట్ నీ పెంచాం.. రూ.40ను 80కి పెంచుకున్నామని వివిరించారు. ఇప్పటికే 300 పడకలు ఉన్నాయి.. ఇప్పుడు ఇంకా 200 వచ్చాయన్నారు. మెరుగైన వైద్య సేవలు అందరూ వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు.
Harishrao : 'పుట్టుక నుంచి చావు దాకా ప్రజలకు ఏం కావాలో.. కేసీఆర్ ఆలోచిస్తారు'