ETV Bharat / state

రైతుబంధు రద్దు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా : హరీశ్​రావు - కాంగ్రెస్‌పై మంత్రి హరీశ్‌రావు ఫైర్

Minister Harish Rao Fires on Congress : కాంగ్రెస్‌ పార్టీ రైతుల పట్ల వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఈసీ అనుమతి రద్దు చేశాక.. రైతులపై రేవంత్‌ ప్రేమ నటిస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే రైతుబంధు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయలేదా? అని ప్రశ్నించారు. తాజాగా హైదరాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

Telangana Assembly Elections 2023
Minister Harish Rao Fires on Congress
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 27, 2023, 9:36 PM IST

Minister Harish Rao Fires on Congress : కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేయడంతోనే ‘రైతుబంధు’కు ఈసీ అనుమతి నిరాకరించిందని రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తొలిత నుంచి హస్తం పార్టీ(Congress Party) రైతుల పట్ల మొండిచెయ్యి వైఖరినే చాటుకుంటుందని విమర్శించారు. హైదరాబాద్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్​రావు మాట్లాడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

రైతుబంధు వెనక్కి తీసుకున్న ఈసీ - ప్రధాన పార్టీల మధ్య కాకరేపుతున్న మాటల తూటాలు

రైతుబంధు ఆపాలని కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేయలేదా? అని సూటిగా ప్రశ్నించారు. రైతుబంధు దుబారా అని కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కర్ణాటకలో(Karnataka) రైతుబంధు ఆపేశారని విమర్శించారు. ఇక్కడ కూడా రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆయన అన్నారు. రైతులకు రైతుబంధు దక్కకూడదన్నదే కాంగ్రెస్‌ ఆలోచనగా ఆరోపించారు.

Harish Rao Reacts on Rythu Bandhu Fund Release Issue : అందుకే అక్టోబర్‌ 23న కాంగ్రెస్‌ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అయితే, రైతు బంధు కొత్తపథకం కాదని.. ఇప్పటివరకు 11 సార్లు ఇచ్చామని.. మరోసారి పంపిణీ చేసేందుకు అనుమతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరితే.. కేంద్ర ఎన్నికల సంఘం(CEC) అనుమతిచ్చిందని తెలిపారు. దీనికి బీఆర్ఎస్, బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కయ్యాయని రేవంత్‌ ఆరోపించినట్లు వివరించారు.

రైతుబంధు విషయంలో కాంగ్రెస్ పార్టీది ఒక కపట నాటకం. ఆపమన్నది వాళ్లే.. మళ్లీ కంప్లైంట్ వెనక్కి తీసుకోమన్నది వాళ్లే.. ఇప్పుడు అనుమతి రద్దు చేస్తే మొసలి కన్నీరు కార్చేది వాళ్లే. అనేక రకాల డ్రామాలు ఆడుతుంది ఆ పార్టీ. కాంగ్రెస్‌ వాళ్లు రైతులకు ఇవ్వరు.. ఇచ్చిన వాళ్లకు అడ్డుపడుతున్నారు. అటువంటి వాళ్లకు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరుతున్నాను. -హరీశ్​రావు, రాష్ట్ర మంత్రి

నేను బతికున్నంత వరకు రైతుబంధు ఆగదు : కేసీఆర్

ఎన్నికల పోలింగ్​కు ఇంకా 4 రోజుల ఉందనగా రైతుబంధు ఇవ్వడమేంటని రేవంత్(Revanth Reddy) ప్రశ్నించారని మంత్రి హరీశ్​రావు పేర్కొన్నారు. రైతులపై ప్రేమే ఉంటే.. ఈసీ నిర్ణయాన్ని స్వాగతించొచ్చు కదా అని ప్రశ్నించారు. ఈసీ అనుమతి రద్దు చేశాక.. రైతులపై రేవంత్‌ కపట ప్రేమ నటిస్తున్నారని దుయ్యబట్టారు. మహా అయితే డిసెంబర్‌ 3 వరకు రైతుబంధును కాంగ్రెస్‌ నేతలు ఆపగలరని.. ఆ తర్వాత మళ్లీ వచ్చేది కేసీఆరేనని తెలిపారు.

Telangana Assembly Elections 2023 : ముచ్చటగా మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమని.. డిసెంబర్ 6న ప్రతిఒక్కరి ఖాతాల్లో జమ అవ్వటం తథ్యమన్నారు. తెలంగాణ రైతులతో కేసీఆర్‌ది(CM KCR) ఓటు బంధం కాదు.. పేగుబంధమని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్‌ వాళ్లు రైతులకు ఇవ్వరు.. ఇచ్చిన వాళ్లకు అడ్డుపడుతున్నారని.. అటువంటి వాళ్లకు ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని ప్రజలను హరీశ్​రావు కోరారు.

రైతుబంధు రద్దు చేయాలన్నదే కాంగ్రెస్ ప్రధాన ఎజెండా : హరీశ్​రావు

పంట పెట్టుబడి ఇస్తే కాంగ్రెస్‌కు కడుపుమంట ఎందుకు: కేటీఆర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.