ETV Bharat / state

'మాకు రావాల్సిన రూ.2,700 కోట్లు ఇవ్వండి'

author img

By

Published : Aug 27, 2020, 4:17 PM IST

జీఎస్టీ పరిహారం కేంద్రమే చెల్లించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. తెలంగాణకు రావాల్సిన రూ.5,420 కోట్లు వెంటనే విడుదల చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

Minister harish rao demands central government to pay GST compensation
జీఎస్టీ కౌన్సిల్​లో మంత్రి హరీశ్ రావు

జీఎస్టీ కౌన్సిల్ ఆన్​లైన్ సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్​తో కలిసి మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రతిపాదనలు, డిమాండ్లను సమావేశంలో వివరించారు. తెలంగాణకు రావాల్సిన రూ. 5,420 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.

కేంద్రం వెంటనే జీఎస్టీ పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. పరిహారంలో సెస్ మిగిలితే కన్సాలిడేట్ ఫండ్​లో జమ చేసి కేంద్రమే వాడుకుంటోందని స్పష్టం చేశారు. సెస్ తగ్గినప్పుడు రాష్ట్రాలు అప్పు తీసుకోవాలనడం సరికాదన్నారు. ఐజీఎస్టీ సమావేశం వెంటనే నిర్వహించాలని, రాష్ట్రానికి రావాల్సిన 2,700 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.