ETV Bharat / state

'కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి' - Minister latest updates

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం దృశ్యమాధ్యమం ద్వారా నిర్వహించారు. బీఆర్కే భవన్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి ఆర్థికమంత్రి హరీశ్ రావు సమావేశంలో పాల్గొన్నారు.

'కేంద్రమే అప్పు తీసుకుని రాష్ట్రాలకు చెల్లించాలి'

author img

By

Published : Oct 5, 2020, 8:24 PM IST

జీఎస్టీ పరిహారం చెల్లింపునకు సంబంధించి కేంద్రం ఇచ్చిన ఐచ్ఛికాలు ఎంత మాత్రం సమ్మతం కావని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. కేంద్రమే అప్పు తీసుకొని రాష్ట్రాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జీఎస్టీ కౌన్సిల్ 42వ సమావేశం దృశ్యమాధ్యమం ద్వారా పాల్గొన్నారు.

బీఆర్కే భవన్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి సమావేశంలో పాల్గొన్న ఆర్థికమంత్రి హరీశ్ రావు... జీఎస్టీ పరిహారాన్ని పొందడం రాష్ట్రాల చట్టబద్ధహక్కు అని అన్నారు. కేంద్రం ఇచ్చిన రెండు ఐచ్చికాలు సమ్మతం కావన్న ఆయన... కేంద్రమే అప్పుగా తీసుకొని పరిహారాన్ని పూర్తిగా చెల్లించాలని కోరారు. తెలంగాణతో పాటు పశ్చిమబంగాల్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.

ఈనెల 12న మరోసారి సమావేశం

పరిహారం చెల్లింపు విషయమై జీఎస్టీ కౌన్సిల్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. సంప్రదింపులు కొనసాగించేందుకు ఈనెల 12న మరోమారు సమావేశం కావాలని నిర్ణయించారు. కొవిడ్ పరిస్థితుల్లో జీఎస్టీ పరిహార మొత్తం రాష్ట్రాలకు అత్యంత అవసరమన్న హరీశ్... ఆత్మనిర్భర ప్యాకేజీ కింద రాష్ట్రాలకు ఇచ్చిన రుణపరిమితికి, జీఎస్టీ పరిహార చెల్లింపులకు ముడిపెట్టవద్దని కోరారు.

తెలంగాణకు రావాల్సిన రూ. 2,638 కోట్లను వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఐజీఎస్టీ మొత్తం 24 వేల‌ కోట్లను వారం రోజుల్లో రాష్ట్రాలకు ఇవ్వనున్నట్లు‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

ఇదీ చదవండి: త్వరలో ఆంగ్లం, ఉర్దూ మీడియంలో విద్యా బోధన: మంత్రి సబిత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.