harish rao on central government: తెలంగాణకు రావాల్సిన నిధులను కేంద్రం నిలిపివేసి.. రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఎఫ్‌ఆర్‌బీఎం రుణపరిమితి పేరుతో రాష్ట్రాలను ఇబ్బంది పెడుతుందని ఆక్షేపించారు. రాష్ట్రాలను సంప్రదించకుండా కోతలు ఎలా విధిస్తారని ప్రశ్నించారు. ఈ మేరకు అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు.
నీతి ఆయోగ్ చెప్పినా రాష్ట్రానికి రూపాయి ఇవ్వలేదని మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రాష్ట్రాల వాటా 42 శాతానికి పెంచామని కేంద్రం చెబుతోందన్న ఆయన.. వాస్తవానికి రాష్ట్రానికి వచ్చిన వాటా 29.6 శాతమే అని తెలిపారు. మన రాష్ట్రానికి రూ.33,712 కోట్ల నష్టం జరిగిందని ఆరోపించారు. సంపదను కేంద్రం మాదిరి తాము మిత్రులకు పంచలేదని.. పేదలకు పంచామని స్పష్టం చేశారు.
నిర్లక్ష్యం లేదు.. బాధ్యతగానే అప్పులు చేస్తున్నాం..: ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం వల్ల దేశంలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు పెండింగ్ పెట్టారని ఆరోపించారు. వ్యాట్ ఉంటే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేదన్న ఆయన.. జీఎస్‌టీ వల్ల తెలంగాణకు నష్టమే ఎక్కువ అన్నారు. రాష్ట్ర అప్పుల్లో కలిపి జీఎస్‌టీ పరిహారం ఇచ్చారని తెలిపారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు చూస్తున్నామన్న హరీశ్‌రావు.. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధిలో ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. బాధ్యతగానే అప్పులు చేస్తున్నామని.. ఎక్కడా నిర్లక్ష్యం లేదని వివరించారు. సకలజనుల లబ్ధి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం వల్ల దేశంలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలి? రాష్ట్రంలోని వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాల్సిన రూ.1,350 కోట్లు పెండింగ్ పెట్టారు. వ్యాట్ ఉంటే రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం వచ్చేది. జీఎస్‌టీ వల్ల తెలంగాణకు నష్టమే ఎక్కువ. రాష్ట్ర అప్పుల్లో కలిపి జీఎస్‌టీ పరిహారం ఇచ్చారు. ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలు చూస్తున్నాం. కేంద్రం ఎన్ని ఇబ్బందులు పెట్టినా అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం. బాధ్యతగానే అప్పులు చేస్తున్నాం.. ఎక్కడా నిర్లక్ష్యం లేదు. సకలజనుల లబ్ధి కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది.- హరీశ్‌రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి
ఇవీ చూడండి..
TS Assembly approved 8 Bills: అసెంబ్లీలో 8 బిల్లులకు ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ వద్ద టెన్షన్.. ముట్టడికి పలు సంఘాల యత్నం
'సమస్యల పరిష్కారానికి కేటీఆర్ హామీ ఇచ్చారు.. అప్పటివరకు సమ్మె ఆపేదే లే'
నర్సరీ స్టూడెంట్‌పై దారుణం.. స్కూల్ బస్సులో రేప్.. డ్రైవర్, మహిళా అటెండర్ కలిసి..