రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తిస్థాయిలో ధాన్యం సేకరిస్తున్నట్లు పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అక్కడక్కడ ఉత్పన్నమైన చిన్న సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నామన్నారు. పేదలు, వలస కార్మికులకు మే నెలలో బియ్యం పంపిణీ చేసేందుకు ఇప్పటికే రేషన్ దుకాణాలకు తరలించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పౌరసరఫరాల సంస్థలో కార్యకలాపాలు విస్తరించి.. అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామంటున్న గంగుల కమలాకర్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి..
ఇవీచూడండి: క్షేమంగా ఉండాలని అల్లాను ప్రార్థించండి: మంత్రి హరీశ్