ETV Bharat / state

ధాన్యం కొనుగోళ్లకి రైస్‌ మిల్లర్లు సహకరించాలి: మంత్రి గంగుల - హైదరాబాద్‌లో మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్షా సమావేశం

ధాన్యం కొనుగోళ్లపై నగరంలో రాష్ట్ర రైస్‌ మిల్లర్ల అసోషియేషన్ ప్రతినిధులతో మంత్రి గంగుల కమలాకర్ సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్‌ సీజన్‌లో అధిక స్థాయిలో ధాన్యం దిగుబడి కావడంతో కొనుగోలు కేంద్రాలను పెంచినట్లు మంత్రి వెల్లడించారు. రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. మిల్లర్ల న్యాయపరమైన సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగా ఉన్నామని తెలిపారు.

minister-gangula-review-meeting-on-grain-purchases-in-hyderabad
ధాన్యం కొనుగోళ్లకి రైస్‌ మిల్లర్లు సహకరించాలి: మంత్రి గంగుల
author img

By

Published : Oct 29, 2020, 1:18 PM IST

Updated : Oct 29, 2020, 5:13 PM IST

ఈ ఏడాది వానాకాలంలో రికార్డు స్థాయిలో ధాన్యం దిగుబడి అవుతున్నందున ధాన్యం విక్రయించేందుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు. గతేడాది ఖరీఫ్‌లో 3,670 కొనుగోలు కేంద్రాల ద్వారా 47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా, ఈ సీజన్‌లో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై రైసు మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌లోని పౌరసరఫరాల సంస్థ భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో ఆ సంస్థ ఛైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, కమిషనర్‌ అనిల్‌కుమార్, ఇతర రైస్‌ మిల్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

అవసరాల మేరకు పెంపు

రాష్ట్ర వ్యాప్తంగా 6,400 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు గంగుల వెల్లడించారు. ఇప్పటి వరకు నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, కరీంనగర్ జిల్లాల్లో 1,071 కేంద్రాలను ప్రారంభించామని చెప్పారు. ఆయా జిల్లాల్లో అవసరాలను బట్టి అప్పటికప్పుడు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

17 శాతం లోపు తేమ

కేంద్రం నిర్దేశించిన నిబంధనల ప్రకారం తేమ శాతం 17 లోపు ఉండాలని, ఆ ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతన్నలు పండించిన ప్రతి ధాన్యం గింజను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తామని తెలిపారు.

రైస్‌ మిల్లర్లు సహకరించాలి

రైస్ మిల్లర్ల న్యాయపరమైన సమస్యల పరిష్కారం విషయంలో సానుకూలంగా ఉన్నామని, ఈ అంశాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి హామీ ఇచ్చారు. నవంబర్‌ మొదటి వారం నుంచి కొనుగోళ్ల ప్రక్రియ వేగవంతం అవుతుందని, కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని ఎలాంటి జాప్యం లేకుండా దించుకోవాలని మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. రైస్ మిల్లర్లు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అన్నదాతలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత మిల్లర్లపై వుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: పెళ్లి చేసుకుంటే దేవుడికి కట్నం!

Last Updated : Oct 29, 2020, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.